13 మందికి రూ.21 లక్షల సీఎం సహాయ నిధి

ABN , First Publish Date - 2023-05-26T01:07:10+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కొవ్వూరు పర్యటనలో అర్జీలు అందించిన 13 మందికి రూ.21 లక్షలు సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులు పంపిణీ చేసినట్టు హోం మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. గురువారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో 13 మందికి రూ.21 లక్షల చెక్కులను పంపిణీచేశారు.

13 మందికి రూ.21 లక్షల సీఎం సహాయ నిధి
బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తున్న హోం వనిత, కలెక్టర్‌ మాధవీలత

  • హోం మంత్రి వనిత, జిల్లా కలెక్టర్‌ మాధవీలత

  • బాధితులకు కొవ్వూరులో చెక్కుల పంపిణీ

కొవ్వూరు, మే 25: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కొవ్వూరు పర్యటనలో అర్జీలు అందించిన 13 మందికి రూ.21 లక్షలు సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులు పంపిణీ చేసినట్టు హోం మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. గురువారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో 13 మందికి రూ.21 లక్షల చెక్కులను పంపిణీచేశారు. ఈ నెల 24న విద్యాదీవెన కార్యక్రమానికి సీఎం జగన్‌ కొవ్వూరు వచ్చిన సందర్భంగా వివిధ వ్యాధులతోను ఆర్థికంగా బాధపడుతున్న 13 మంది సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఆరోగ్య అవసరాలకు దరఖాస్తు చేసుకున్న 11 మందికి రూ.1 లక్ష చొప్పున, ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందజేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. ఇదిలా ఉండగా కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హోం మంత్రి తానేటి వనిత మాట్లాడారు. కొవ్వూరులో ఈ నెల 24న సీఎం జగన్‌ పర్యటనను విజయవంతం చేసిన నాయకులకు, నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని కొవ్వూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత భవన నిర్మాణాలకు నిధులు, కొవ్వూరులో కాపు కల్యాణ మండపం, ఎస్సీ కమ్యూనిటీ హాలు, మైనార్టీలకు షాదీఖానా మంజూరు, కుమారదేవం, పైడిమెట్ట, బ్రాహ్మణగూడెం, చాగల్లు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాల్లో పంపులు, మోటార్ల మరమ్మతులు, మూడు మండలాల్లో మూడు అంబేడ్కర్‌ భవనాలు, తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట పరిసర ప్రాంతాల్లో కొవ్వాడ కెనాల్‌పై కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించి, నిధులు మంజూరు చేస్తున్నట్టు సభాముఖంగా ప్రకటించారన్నారు. కాగా హోం మంత్రి అభ్యర్ధనతో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్టు సీఎం జగన్‌ ప్రకటించడంపై మంత్రి వనితను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి, కాపు సంఘం నాయకులు సత్కరించి, అభినందించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన మరో కార్యక్రమంలో జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు 2 జతల యూనిఫారం, ట్రాక్‌ సూట్‌కేసులను హోం మంత్రి పంపిణీ చేశారు. ఈ నెల 28 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు కలకత్తాలో జరిగే జాతీయ సబ్‌ జూనియర్‌ వాలీబాల్‌ పోటీల్లో 12 మంది బాలికల జట్టు పాల్గొననుందని కోచ్‌ కొయ్యల ప్రసాద్‌ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, బండి పట్టాభిరామారావు, కాపు సంఘం అధ్యక్షుడు గండ్రోతు కోదండ రామారావు, యాళ్ల నరసింహరావు, గండ్రోతు అంజలీదేవి, చౌటిపల్లి వీరన్న, నగళ్ళపాటి శ్రీనివాస్‌, తోట రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T01:07:10+05:30 IST