Share News

సీఎం జగన్‌కు బలహీన వర్గాల సంక్షేమంపై శ్రద్ధ లేదు

ABN , First Publish Date - 2023-11-22T00:10:49+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌కు దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ బలహీన వర్గాల సంక్షేమంపై లేదని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు.

సీఎం జగన్‌కు బలహీన వర్గాల సంక్షేమంపై శ్రద్ధ లేదు

బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ల

మండపేట, నవంబరు 21: ముఖ్యమంత్రి జగన్‌కు దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ బలహీన వర్గాల సంక్షేమంపై లేదని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట పట్టణంలో 10, 11 వార్డుల్లో మంగళవారం బాబు ష్యూరిటీ భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమంను ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ జనసేన, టీడీపీ శ్రేణులతో కలసి క్లస్టర్‌ 4లో యూనిట్‌ 14, 15లో ఇంటింటికీ పర్యటించి చంద్రబాబు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పేర్కొన్న అంశాలను ప్రజలకు వివరించారు. ముందుగా ఎమ్మెల్యే కొండపల్లి వారి వీధిలో ఉన్న దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్‌ మాజీ ఛైర్మెన్‌ చుండ్రు శ్రీవరప్రకాష్‌, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

రానున్నది టీడీపీ ప్రభుత్వమే

అంబాజీపేట: రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్న జగన్‌ ప్రభుత్వంపై విసుగు చెందిన ప్రజలు రానున్న ఎన్నికలలో టీడీపీకి పట్టంగట్టి చంద్రబాబును సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దాసరి సత్యనారాయణ అన్నారు. పుల్లేటికుర్రు బాబుష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పబ్బినీడి రాంబాబు, దాసరి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఇరుసుమండ ఆంజ నేయ స్వామి ఆలయం వద్ద చంద్రబాబుకు బెయిల్‌ రావడంపై టీడీపీ నాయకులు సంబరాలు జరిపారు. కార్యక్రమంలో చిన్నం బాలవిజయరావు, వక్కలంక బుల్లియ్య, సుంకర గణపతిరావు, నేదునూరి వెంకటరమణబాబులు పాల్గొన్నారు.

చంద్రబాబు పాలన కోసం ప్రజల ఎదురుచూపులు

మామిడికుదురు: చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆ పార్టీ వాణిజ్య విభాగం కార్యదర్శి బోనం బాబు అన్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం లూటుకుర్రు గ్రామంలో మంగళవారం జరిగింది. టీడీపీ-జనసేన నాయకులు ఇంటింటికీ తిరిగి గ్యారంటీ పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మద్దాల కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.

300వ రోజుకు బోనం హనుమాన్‌ దీక్ష

రాజోలు, నవంబరు 21: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి కావాలని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పాదయాత్ర ఆటంకం లేకుండా సాగాలని హార్టీకల్చర్‌ యూనివర్శిటీ మాజీ డైరెక్టర్‌ బోనం నాగేశ్వరరావు చేపట్టిన హనుమాన్‌ దీక్ష మంగళవారంనాటికి 300వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ లోకేశ్‌ పాదయాత్ర రాజోలు నియోజక వర్గం వచ్చే వరకు దీక్ష చేద్దామనుకున్నానని, చంద్రబాబు అక్రమ అరెస్టుతో దీక్షను పొడింగించారని తెలిపారు. చంద్రబాబుకు షరతులు లేని రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరైన సందర్భంగా ఆంజనేయస్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశానన్నారు. కార్యక్రమం లో మేడిచర్ల సుబ్బారావు, అడ్డాల నాగేశ్వరరావు, యాండ్ర నాని, చేగొండి రామ్మోహన రావు, దొమ్మేటి హరి, గుద్దటి భద్రం పాల్గొన్నారు.

Updated Date - 2023-11-22T00:10:52+05:30 IST