Share News

‘చెకుముకి’తో శాస్త్రీయ దృక్పథం పెంపు

ABN , Publish Date - Dec 22 , 2023 | 12:51 AM

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి చెకుముకి పోటీలు దోహదపడతాయని జన విజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్‌ కొప్పిశెట్టి కృష్ణసాయి తెలిపారు.

 ‘చెకుముకి’తో శాస్త్రీయ దృక్పథం పెంపు
రాజానగరంలో విద్యార్థులకు బహుమతి అందజేస్తున్న ఉపాధ్యాయులు

  • జన విజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్‌ కృష్ణసాయి

  • పలు పాఠశాలల్లో మండలస్థాయి పోటీలు

బిక్కవోలు, డిసెంబరు 21: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి చెకుముకి పోటీలు దోహదపడతాయని జన విజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్‌ కొప్పిశెట్టి కృష్ణసాయి తెలిపారు. పందలపాక ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి చెకుముకి పోటీలు నిర్వహించారు. పోటీల్లో పందలపాక ఉన్నత పాఠశాలకు చెందిన పి.భువనతేజ, వి.అఖిల్‌, టీఎస్‌ శరణ్యలు ప్రథమ, కొంకుదురు ఉన్నత పాఠశాలకు చెందిన కె.దినేష్‌కుమార్‌, ఎల్‌.రమ్య, కె.హేమంత్‌ ద్వితీయ స్థానాలు సాధించారు. వీరికి ఆయన ప్రశంసా పత్రాలు అందజేసి, మండల స్థాయి విజేతలకు జిల్లా స్థాయి పోటీలు జనవరి ఏడున రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీనివాసరెడ్డి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 12:52 AM