చంద్రబాబును సీఎంను చేసేందుకు పనిచేయాలి
ABN , First Publish Date - 2023-04-03T01:05:37+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కార్యకర్తలు కష్టించి పనిచేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రెడ్డి సుబ్ర హ్మణ్యం అన్నారు.
కె.గంగవరం, ఏప్రిల్ 2: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కార్యకర్తలు కష్టించి పనిచేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రెడ్డి సుబ్ర హ్మణ్యం అన్నారు. ఆదివారం దంగేరు పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వాసంశెట్టి దుర్గారావు అధ్యక్షతన మండల కమిటీ అధ్యక్షుడు మరివాడ చిన్నికృష్ణ, మాజీ సర్పంచ్ రావిపాటి గణేష్ చౌధరి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమా వేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం, అమరావతి పూర్తి కావాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, సంక్షేమ ఫలాలు అందరకీ అందాలన్నా, రాష్ట్రం ప్రశాంతంగా ఉండా లన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్ర బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గరిగపాటి సూర్యనారాయణ, చుండ్రు వీవీ ఎస్‌ఎస్ చౌదరి, మేడిశెట్టి సూర్యనారాయణ, మేడిశెట్టి రవికు మార్, సలాది రమేష్, కడియాల రాఘవన్, పెంకే సాంబశి వరావు, చింతపల్లి వీరభద్రరావు, మరివాడ సూరిబాబు, బలుసు శివప్రసాద్, కొత్తపల్లి మురార్జీ, గన్ని శ్రీనివాసు, పలు గ్రామాల నుంచి వచ్చిన గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.