25 నుంచి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర
ABN , First Publish Date - 2023-11-21T23:49:33+05:30 IST
కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు తీరు తెన్నులు తెలుసుకోవడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్యోద్దేశమని కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారి కేంద్ర ఉన్నత విద్య డిప్యూటీ కార్యదర్శి ప్రియాంక చతుర్వేది తెలిపారు.

రాజమహేంద్రవరం రూరల్ నవంబరు21: కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు తీరు తెన్నులు తెలుసుకోవడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్యోద్దేశమని కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారి కేంద్ర ఉన్నత విద్య డిప్యూటీ కార్యదర్శి ప్రియాంక చతుర్వేది తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముందస్తు ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొని సంబంధిత అధికారులతో సమీక్షించారు.ప్రతి లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చూసే బాధ్యత ప్రతి ఒక్క అధికారిపై ఉందన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి 2024 జనవరి 26 వరకు క్షేత్రస్థాయిలో ప్రచార అవగాహన కార్యక్రమాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు కలెక్టర్ మాధవీలత తెలిపారు. అనంతరం వికసిత్ భారత్ సంకల్ప యాత్రవాహనాలను అఽధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.రజనీ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు పి.సువర్ణ, ఎం.భాను ప్రకాష్, ఎ.ముఖలింగం, కేఎస్.జ్యోతి, ఎస్.రమేష్, జి.పరశరామ్, పి.వీణాదేవి తదితరులు పాల్గొన్నారు.