సీడీపీవో విజయలక్ష్మి మృతి

ABN , First Publish Date - 2023-09-04T00:43:29+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), సెప్టెంబరు 3: కాకినాడ అర్బన్‌ సీడీపీవో ఆదుర్తి విజయలక్ష్మి అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ ఆదివా రం మృతిచెందారు. ఆమె గత కొంత కాలం గా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. విజయలక్ష్మి 1993లో ఏపీపీఎస్సీ ద్వారా గ్రేడ్‌ వన్‌ సూపర్‌వైజర్‌గా స్ర్తీ, శిశు సంక్షేమశాఖలో చేరారు. అనం

సీడీపీవో విజయలక్ష్మి మృతి

కార్పొరేషన్‌ (కాకినాడ), సెప్టెంబరు 3: కాకినాడ అర్బన్‌ సీడీపీవో ఆదుర్తి విజయలక్ష్మి అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ ఆదివా రం మృతిచెందారు. ఆమె గత కొంత కాలం గా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. విజయలక్ష్మి 1993లో ఏపీపీఎస్సీ ద్వారా గ్రేడ్‌ వన్‌ సూపర్‌వైజర్‌గా స్ర్తీ, శిశు సంక్షేమశాఖలో చేరారు. అనంతరం 2013లో సీడీపీవోగా పదోన్నతి పొం దారు. ఆమె భర్త గతేడాది మృతిచెందారు. వారికి ఒక కు మారుడు ఉన్నాడు. విజయలక్ష్మి మరణవార్త తెలిసిన వెంట నే ఐసీడీఎస్‌ పీడీ కె.ప్రవీణ, పలువురు సీడీపీవోలు, సూపర్‌వైజర్‌లు కాకినాడ చేరుకుని విజయలక్ష్మి భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. విజయలక్ష్మి 2024 జూన్‌ నెలలో ఉద్యోగ విరమణ పొందనున్నారు.

Updated Date - 2023-09-04T00:44:31+05:30 IST