తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత
ABN , First Publish Date - 2023-03-19T02:07:32+05:30 IST
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం జెడ్.మేడపాడు బస్‌షెల్టర్‌లో ఈనెల 15న కిడ్నాప్‌కు గురైన మూడేళ్ల బాలుడు కేసును మండపేట రూరల్ పోలీసులు ఛేదించారు.

మండపేట, మార్చి 18: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం జెడ్.మేడపాడు బస్‌షెల్టర్‌లో ఈనెల 15న కిడ్నాప్‌కు గురైన మూడేళ్ల బాలుడు కేసును మండపేట రూరల్ పోలీసులు ఛేదించారు. రాజమహేంద్రవరం కోటిలిం గాలపేటకు చెందిన వరదచంద్రమోహన్, నావుడు భవాని, ధవళేశ్వరానికి తొండపు గౌతమిలు ఈనెల15న జెడ్.మేడపాడు బస్‌షెల్టర్‌లో మూడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని విజయవాడ తీసుకువెళ్లి విక్రయించేందుకు ఈనెల17న రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో ఉన్న నిందితులను అరెస్టు చేసినట్టు మండపేట రూరల్ ఎస్‌ఐ బళ్ల శివకృష్ణ చెప్పారు. నిందితులు కిడ్నాప్ కోసం వినియోగించిన మోటార్‌సైకిల్, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నింది తులు వరదచంద్రమోహన్, నావుడు భవాని, తొండపు గౌత మిలకు కోర్టు రిమాండ్ విధించిందని ఎస్‌ఐ చెప్పారు.