బొండాల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2023-04-15T01:44:02+05:30 IST

జిల్లాలో రబీ వరికోతలు జరుగుతు న్నాయి. ఇప్పటికే ధాన్యం కొనుగోలుకు సంబంధించి 389 కేం ద్రాలకుగాను 174 కేంద్రాలను ప్రారంభించామని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది బొండాలు రకం ధాన్యాన్ని రైతు లు 90 శాతం మేర సాగుచేశారు.

బొండాల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

మండపేట, ఏప్రిల్‌ 14 : జిల్లాలో రబీ వరికోతలు జరుగుతు న్నాయి. ఇప్పటికే ధాన్యం కొనుగోలుకు సంబంధించి 389 కేం ద్రాలకుగాను 174 కేంద్రాలను ప్రారంభించామని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది బొండాలు రకం ధాన్యాన్ని రైతు లు 90 శాతం మేర సాగుచేశారు. నిన్నటి వరకు ప్రభుత్వం ఈ ధాన్యాన్ని కొనేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆం దోళన నెలకొంది. అయితే బొండాలు రకం ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో రైతులు కాస్త ఊరట చెందా రు. జిల్లాలో చాలాచోట్ల సార్వా పంట సాగుచేయకపోవడంతో ప్రస్తుత రబీ సాగును ముందు సాగుచేశారు. జిల్లాలో మొత్తం 1.76 లక్షలు ఎకరాల్లో వరిసాగు చేశారు. వరి పంట దిగుబడి కూడా ఎకరాకు పంటకోత ప్రయోగం ద్వారా 46 నుంచి 50 బస్తాల వరకు వస్తుందని వ్యవసాయశాఖాధికారులు అంచనా వేశారు. ఈసారి డెల్టాకంటే కోనసీమలో వరికోతలు ముందుగా వచ్చేశాయి. ప్రస్తుతం రైతులు 90 శాతం మేర ఎంటీయు1532 బొండాల రకాన్ని సాగుచేయగా, మిగిలిన పది శాతం 1121 రకాన్ని సాగుచేశారు. కాగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే విషయంపై కోనసీమ జిల్లా సివిల్‌ సప్లయి అధికారిణి తులసిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, ధాన్యం కొనుగోలుకు జిల్లాలో ఇప్పటివరకు 174 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశా మని చెప్పారు. ఇంకా మిగిలిన కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పదివేల సంచులకు తక్కువ కాకుండా ఉంచడం జరిగిందని చెప్పారు. రైతులు వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధిం చి రైతు ఖాతాలోకి నిర్ణీత సమయంలో బ్యాంకు ద్వారా జమ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. రైతులు గిట్టుబాటు ధరకు తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని కోరారు. కోనసీ మలో రబీ కోతలు ప్రారంభమయ్యాయని, రామచంద్రపురం డివిజన్‌లో ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్న దృష్ట్యా కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. జిల్లాలో 1.76 లక్షల ఎకరాల్లో వరిపంట సాగుచేయగా, ధాన్యం దిగుబ డి 6.3 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర వస్తుందని అంచనా. ప్రభు త్వం మాత్రం రైతులు వద్ద నుంచి 5 లక్షల మెట్రిక్‌ టన్నులు కోనుగోలుచేయాలని నిర్ణయించింది. మిగిలిన ధాన్యాన్ని రైతులు విక్రయించుకోవడంతోపాటు రైతులు తమ అవసరాలకు విని యోగించుకుంటారని అంచనావేశారు. ఇక ధాన్యం బస్తా 75 కిలోల ధర రూ.1532గా ప్రభుత్వం ధరను నిర్ణయించగా, మిల్లర్లు దానికంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.

Updated Date - 2023-04-15T01:44:02+05:30 IST