నిధులు కేంద్రానివి.. పేర్లు మీవా?
ABN , First Publish Date - 2023-01-27T00:45:22+05:30 IST
వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులతో కొన్ని పథకాలు చేపట్టి.. వాటికి వైఎస్‌ఆర్ జగనన్న తదితర పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిని బీజేపీ ఖండిస్తోంది.
ప్రశ్నించిన కేంద్ర సహాయ మంత్రి
మోదీ ఫొటో పెట్టాలని డిమాండ్
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులతో కొన్ని పథకాలు చేపట్టి.. వాటికి వైఎస్‌ఆర్ జగనన్న తదితర పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిని బీజేపీ ఖండిస్తోంది. తామిచ్చిన నిధులతో చేపట్టిన పనుల విషయంలో కేవలం సీఎం జగన్ బొమ్మ మాత్ర మే కాదు.. ప్రధాని మోదీ బొమ్మ కూడా వేయాలని వాదిస్తుంది. కేంద్ర సమాచారశాఖ మంత్రి దేవ్‌సిన్హ చౌహాన్ బుధవారం, గురువారం రాజమహేంద్రవరంలో పర్యటించారు. రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్నట్టు చెబుతున్న పలు పథకాలను పరిశీలించారు. ఇవన్నీ తమ ఘనతేనని చెప్పారు. అమృతపథకం కింద రూ.కోట్లతో సుం దరీకరిస్తున్న కంబాలచెరువు పార్కు, ధవళేశ్వరంలో టిడ్కో గృహాలను పరిశీలించారు. అంగన్‌వాడీ, పీఎం కిసాన్‌యోజన, ఉపాధి హామీ పథకం వంటివన్ని కేంద్రం ఇచ్చే నిధులతో చేపడుతు న్నట్టు చెప్పారు.అయితే వైసీపీ కేవలం జగన్ బొమ్మను మాత్రమే వేసి.. వాళ్ల పథకాల కిందే ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. ఇక అలా సాగదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గతం నుంచీ ఈ వాదన చేస్తున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వం కొంత ఇబ్బందిలో పడు తోంది. ఇవన్నీ మా గొప్పంటే గొప్ప అని ప్రచారం చేసుకోవడం కాదు.. పనులు పూర్తి చేయించడం లో పోటీపడితే బాగుంటుందనేది ప్రజల అభిప్రాయం. ఇప్పటికే పోలవరం పడుకుంది... జలజీవన్ మిషన్ తడారిపోయింది... టిడ్కో గృహాలను గత తెలుగుదేశం ప్రభుత్వమే చాలా వరకూ నిర్మించినా చాలా ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించలేదు. రాజమహేంద్రవరం లో వాన ముంపును నివారించడం కోసం అమృతపథకం కింద తెలుగుదేశం హయాంలోనే పనులు మొదలయ్యాయి.వైసీపీ వ చ్చాక కొంతకాలం పనులు ఆపేశారు.తర్వాత కొనసాగించినా, ఇప్పటికే పూర్తికాలేదు. ఇవన్నీ పూర్తి చేయాలని ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారు.
అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వం
కేంద్ర సహాయ మంత్రి దేవ్ సిన్హ చౌహన్
రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 26 : వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర సమాచారశాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హ్ చౌహాన్ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో చేపట్టే పథకాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంటే వాటిని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. కేంద్ర నిధులతో చేపడుతున్న నిర్మాణాలకు వైసీపీ రంగులు వేసుకుంటున్నారు. ఇది సరైంది కాదన్నారు. రాష్ట్రంలో గత మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో కొత్త పరిశ్రమలు లేవు, ఆర్థిక ప్రగతి అసలే లేదు. చివరకు ఉద్యోగులకు జీతాలివ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసల్లేవు అన్నారు. వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే గ్రామ పంచాయతీల ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం లాగేసుకుంటున్నదన్నారు. దీనిపై సర్పంచ్‌లు తమను కలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే పోలవరం నిర్మాణంలో జాప్యం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనాలను భారీగా పెంచి కేంద్రాన్ని డబ్బులు ఇవ్వమంటే ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారని ప్రశ్నించారు. పోలవరం పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, కురగంటి సతీష్ పాల్గొన్నారు.