బైక్‌ను ఢీకొన్న లారీ
ABN , First Publish Date - 2023-05-26T01:04:38+05:30 IST
లారీని ఢీకొట్టిన మోటర్‌సైకిలు ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలయ్యాయని ఎస్‌ఐ టి.రామకృష్ణ తెలిపారు.

అన్నయ్య మృతి.. చెల్లెలికి తీవ్రగాయాలు
రంగంపేట, మే, 25: లారీని ఢీకొట్టిన మోటర్‌సైకిలు ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలయ్యాయని ఎస్‌ఐ టి.రామకృష్ణ తెలిపారు. మండలంలోని వడిశలేరు కార్గిల్ ఫ్యాక్టరీ ఎదురుగా ఏడీబీ రోడ్డుపై మధ్యాహ్నం కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న బైక్‌ను రాజానగరం నుంచి కాకినాడ వైపు వెళుతున్న బోర్‌వెల్ లారీ స్పీడ్‌గా అజాగ్రత్తగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ఘనటలో అనపర్తి సూర్యకార్తిక్ (21) మృతిచెందగా, తీవ్రగాయాలపాలైన చెల్లెలు నవ్యశ్రీని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్ పెనుమర్తి గ్రామ వాసిగా గుర్తించామని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.