భీమేశ్వరుని సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2023-03-31T00:53:52+05:30 IST

ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని గురువారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి వి.రామసుబ్రహ్మణ్యన్‌ సతీసమేతంగా సందర్శించారు.

భీమేశ్వరుని సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

ద్రాక్షారామ, మార్చి 30: ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని గురువారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి వి.రామసుబ్రహ్మణ్యన్‌ సతీసమేతంగా సందర్శించారు. వారికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జిల్లా దేవదాయశాఖ అధికారి కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌, ఈవో పి.టి.విసత్యనారాయణ స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. న్యాయమూర్తి రామసుబ్రహ్మణ్యన్‌ దంపతులు భీమేశ్వరస్వామి, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం న్యాయమూర్తి దంపతులకు నంది మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అంద జే శారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. ఫస్ట్‌ అడిషనల్‌ జిల్లా జడ్జి సునీత, అడిషనల్‌ ఎస్‌ఫీ లతా మాధురి, మేజిస్ట్రేట్‌ శ్రీనివాసరావు, జూనియర్‌ సివిల్‌జడ్జి బి.వాణిశ్రీ, ఎస్సీ,ఎస్టీ కేసుల విచారణ కోర్టున్యాయమూర్తి నాగేశ్వరరావు, ఆర్డీవో సింధు సుబ్రహ్మణ్యం, తహశీల్దార్‌ తేజేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:53:52+05:30 IST