బ్యారేజీ రహదారి నిర్మాణం పూర్తి చేస్తాం
ABN , First Publish Date - 2023-11-20T00:20:51+05:30 IST
బ్యారేజీ రహదారి నిర్మాణం పూర్తి చేస్తాం

రావులపాలెం, నవంబరు 19: బొబ్బర్లంక-ధవళేశ్వరం బ్యారేజీ రహదారి నిర్మాణం పూర్తి చేసి తీరుతామని ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. గోపాలపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బ్యారేజీ రోడ్డు పాడై ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం అన్నారు. ప్రతిపక్షాలు రోడ్డు నిర్మాణం గురించి అడగడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈరోడ్డుకు ఈనెల16నే టెండర్లు పిలిచామని, సాంకేతిక కారణాలతో ఆలస్యమైందని, సీఎందృష్టికి తీసుకెళ్లగా రూ.1.76కోట్లు మంజూరు చేశార న్నారు. టెండర్ల ప్రక్రియ తర్వాత పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.