చైతన్యయాత్రను విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2023-06-26T00:24:10+05:30 IST
టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల 27న జరగబోయే భవిష్య త్తుకు గ్యారెంటీ చైతన్య బస్సు యాత్రను విజయవంతం చేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. పెర వలిలో జరిగిన టీడీపీ మండల కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మా ట్లాడారు.
పెరవలి, జూన్ 25: టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల 27న జరగబోయే భవిష్య త్తుకు గ్యారెంటీ చైతన్య బస్సు యాత్రను విజయవంతం చేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. పెర వలిలో జరిగిన టీడీపీ మండల కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మా ట్లాడారు. పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ బస్సుయాత్రను నిర్వహిస్తున్నారని, మ్యానిఫెస్టోలో ఉన్న పథకాలు ద్వారా ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలు గుతుందని ప్రజలకు అర్థమయ్యే విధంగా కార్యకర్తలు తెలియజేయాలన్నారు. బస్సుయాత్ర నల్లాకులవారిపాలెం నుంచి ముక్కామల, ఖండవల్లి, అన్నవర ప్పాడు మీదుగా పెరవలి వస్తుందని అనంతరం దీపికా ఫంక్షన్ హాలులో సమావేశం జరుగు తుందన్నారు. ర్యాలీని, సమావేశాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండ లాధ్యక్షుడు అతికాల రామకృష్ణమ్మ, సలాది కృష్ణమూర్తి, అబ్బిశెట్టి సత్తిరాజు, ప్రమీల, వాకలపూడి వీర్రాజు, నల్లాకుల వెంకటేశ్వరరావు, హనుమంతు సుబ్రహ్మణ్యం, బొడ్డు రామాంజనేయులు పాల్గొన్నారు.