‘విధులకు హాజరుకాకపోతే చర్యలు తప్పవు’
ABN , Publish Date - Dec 29 , 2023 | 11:38 PM
అమలాపురం మున్సిపల్ కమిషనరు వి.అయ్యప్పనాయుడు ఆదేశాల మేరకు వలంటీర్లు అందరూ విధులకు హాజరుకావాలని, హాజరుకాని వలంటీర్లపై చర్యలు తప్పవని శ్రీరామ్‌నగర్ సచివాలయ వార్డు అడ్మిన్ సెక్రటరీ హెచ్చరించారు.
అమలాపురం టౌన్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అమలాపురం మున్సిపల్ కమిషనరు వి.అయ్యప్పనాయుడు ఆదేశాల మేరకు వలంటీర్లు అందరూ విధులకు హాజరుకావాలని, హాజరుకాని వలంటీర్లపై చర్యలు తప్పవని శ్రీరామ్‌నగర్ సచివాలయ వార్డు అడ్మిన్ సెక్రటరీ హెచ్చరించారు. సచివాలయ పరిధిలోని 17మంది వలంటీర్లు విధులకు హాజరు కావట్లేదని కమిషనర్‌కు లిఖితపూర్వకంగా లేఖ అందించారు. శుక్రవారం 292 మంది వలంటీర్లకుగాను 115మంది విధులకు హాజరు కాగా 177 మంది గైర్హాజరయ్యారు. మిగిలిన ఏ వార్డుల్లోనూ లేనివిధంగా ఒకేవార్డులో 17మందిపై ఫిర్యాదు చేయడం చర్చనీ యాంశంగా మారింది. తాను సెలవులో ఉన్నానని, ఎవరికీ నోటీసులు జారీ చేయలేదని కమిషనరు చెప్పారు.