కదం తొక్కిన ఆశాలు

ABN , First Publish Date - 2023-03-29T00:52:34+05:30 IST

క్షేత్రస్థాయిలో వైద్యసేవలు అందించడంలో ఆశావర్కర్ల పాత్ర కీలకమని, వారి కష్టానికి సరైన ప్రతిఫలం దక్కడం లేదని, ఆశాలకు కనీ స వేతనంగా రూ.26వేలు చెల్లించాలని ఆశావర్కర్స్‌ యూనియన్‌, సీఐటీయూ డిమాం డ్‌ చేశాయి. ఆశావర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఐ టీయూ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.

కదం తొక్కిన ఆశాలు
డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేస్తున్న ఆశా కార్యకర్తలు

డిమాండ్ల సాధనకు డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ధర్నా

జీజీహెచ్‌(కాకినాడ), మార్చి 28: క్షేత్రస్థాయిలో వైద్యసేవలు అందించడంలో ఆశావర్కర్ల పాత్ర కీలకమని, వారి కష్టానికి సరైన ప్రతిఫలం దక్కడం లేదని, ఆశాలకు కనీ స వేతనంగా రూ.26వేలు చెల్లించాలని ఆశావర్కర్స్‌ యూనియన్‌, సీఐటీయూ డిమాం డ్‌ చేశాయి. ఆశావర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఐ టీయూ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. కాకినాడ సుందరయ్యభవన్‌ నుంచి అధికసంఖ్యలో ఆశాలు ర్యాలీగా బయల్దేరి డీఎంహెచ్‌వో కార్యాలయానికి చేరుకున్నారు. ఆశావర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌర వ అధ్యక్షురాలు జి.బేబీరాణి, సీఐటీయూ నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలపై అధికారుల వేధింపులు ఆపాలని, జాబ్‌చార్ట్‌ విడుదల చే యాలని, అధిక పనిభారాన్ని తగ్గించాలని, ఆశావర్కర్ల నియామకాల్లో రాజకీయ జోక్యా న్ని నివారించాలని, ఆశావర్కర్‌ చనిపోతే బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. నర్ల ఈశ్వరి, చంద్రమళ్లి పద్మ, దువ్వా శేషుబాబ్జీ, చక్కల రాజ్‌కుమార్‌, రమణ, చంద్రావతి రొంగల ఈశ్వర్రావు, షేక్‌ పద్మ, నక్కళ్ల శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2023-03-29T00:52:34+05:30 IST