అక్రమ నిర్బంధాలకు మూల్యం చెల్లించుకుంటారు

ABN , First Publish Date - 2023-09-26T01:28:09+05:30 IST

జగన్‌ ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం వెళతున్న అంగన్‌వాడీలపై అక్రమ అరెస్టులు నిర్బంధించడంపై తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవా ధ్యక్షుడు జువ్వల రాంబాబు అన్నారు. సోమవారం నిడదవోలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు.

అక్రమ నిర్బంధాలకు మూల్యం చెల్లించుకుంటారు

  • అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు రాంబాబు

  • తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసనలు

నిడదవోలు, సెప్టెంబరు 25: జగన్‌ ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం వెళతున్న అంగన్‌వాడీలపై అక్రమ అరెస్టులు నిర్బంధించడంపై తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవా ధ్యక్షుడు జువ్వల రాంబాబు అన్నారు. సోమవారం నిడదవోలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ అంగన్‌వాడీలు తమ సమస్యల పరిష్కారానికి విజయవాడ వెళ్తుండగా ప్రభుత్వం, పోలీసులు.. మహిళలని కూడా చూడకుండా అరెస్ట్‌లు చేయడం, నిర్బంధించడం, దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. కార్యక్ర మంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు జరీనాబేగం, కరుణకుమారి, శ్యామల, లక్ష్మి, విమల, శైలజాకుమారి, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T01:28:09+05:30 IST