ఏపీఆర్‌ఎస్‌ఏ కాకినాడ డివిజన్ అధ్యక్షుడిగా సూరిబాబు
ABN , First Publish Date - 2023-05-26T00:49:29+05:30 IST
ఏపీఆర్‌ఎస్‌ఏ కాకినాడ డివిజన్ అధ్యక్షుడిగా తా ళ్లరేవు డిప్యూటీ తహసీల్దార్ ఎం.సూరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పోర్టుసిటీ(కాకినాడ), మే 25: ఏపీఆర్‌ఎస్‌ఏ కాకినాడ డివిజన్ అధ్యక్షుడిగా తా ళ్లరేవు డిప్యూటీ తహసీల్దార్ ఎం.సూరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువా రం కాకినాడ రెవెన్యూ భవన్‌లో ఉదయం 10గంటలకు జరిగిన ఎన్నికల ప్రక్రియ లో పోటీదారుల సమైక్యతతో ఎన్నికల అధికారి ఎం.విజయ్‌కుమార్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ సంఘ కార్యదర్శిగా పిఠాపురం డిప్యూటీ తహసీ ల్దార్ డి.కృష్ణ, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పెదపూడి డిప్యూటీ తహసీల్దార్ జి.యం రామ్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్స్‌గా కరప మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పి.మా చారావు, తాళ్లరేవు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పి.సాయి రవితేజ, కాకినాడ డివి జనల్ అధికారి నాగ సౌజన్య, జాయింట్ సెక్రటరీగా కరప డిప్యూటీ తహసీల్దార్ కేఎల్ సురేష్‌కుమార్, కాకినాడ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎ.దీపక్‌కుమార్, ట్రెజరర్‌గా కాకినాడ రూరల్ డిప్యూటీ తహసీల్దార్ వై.శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియను ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు పితాని త్రినాథ్ పర్యవేక్షించగా నూతన కార్యవర్గం 2023 నుంచి 2026 వరకు మూడేళ్ల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన ఏపీఆర్‌ఎస్‌ఏ కాకినాడ డివిజన్ యూనిట్ కార్యవర్గాన్ని ఆర్డీవో బీవీ రమణ, డివిజన్‌లోని అన్ని మండలాల రెవెన్యూ ఉద్యో గులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు.