ఎక్కడ చూసినా మొలకెత్తిన ధాన్యం రాశులే
ABN , First Publish Date - 2023-05-06T01:20:15+05:30 IST
ఎక్కడ చూసినా మొలకెత్తిన ధాన్యం రాశులే దర్శనమిస్తున్నాయి. మొలకెత్తిన ధాన్యాన్ని చూసి రైతు కన్నీరుమున్నీరవుతు న్నాడు. రెండు రోజులుగా భానుడు కరుణించడంతో వారం రోజులుగా బరకాల మాటున ఉన్న ధాన్యాన్ని ఒక్కొక్కటిగా తెరుస్తు వస్తున్నారు.
కన్నీరుమున్నీరవుతున్న రైతులు
ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూపులు
కుతుకులూరులో పర్యటించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అనపర్తి/బిక్కవోలు, మే 5: ఎక్కడ చూసినా మొలకెత్తిన ధాన్యం రాశులే దర్శనమిస్తున్నాయి. మొలకెత్తిన ధాన్యాన్ని చూసి రైతు కన్నీరుమున్నీరవుతు న్నాడు. రెండు రోజులుగా భానుడు కరుణించడంతో వారం రోజులుగా బరకాల మాటున ఉన్న ధాన్యాన్ని ఒక్కొక్కటిగా తెరుస్తు వస్తున్నారు. అయితే అప్పటికే ధాన్యం మొలకెత్తి ఉండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకా అనేక చోట్ల కోత లు పూర్తి కాకపోవడంతో వరి పనలు నీటిలోనే తేలియాడుతున్నాయి. రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసేందుకే ఎవరూ ముందుకు రాని ప్రస్తుత తరుణంలో మొలకెత్తిన ధాన్యం ఏం చేయాలో పాలు పోవడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా పంట పొలాలు ధాన్యం వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో పలువురు రాజ కీయ నాయకులు పర్యటిస్తున్నారు. కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శిస్తు న్నారు. బాధిత రైతులను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. శుక్రవారం అనపర్తి మండలం కుతుకులూరు, బిక్కవోలు మండలం బలభద్రపురంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మొలకలు వచ్చిన ధాన్యాన్ని వారికి చూపుతూ తమ బాధలను చెప్పుకున్నారు. ఇప్పటి వరకు ఎవరూ తమను పరామర్శించిన పాపాన పోలేదని వాపోయారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని కోతలు కోయని పంటకు ఎకరాకు రూ.25వేల నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు వర్షాలకు దొరికిపో వాల్సి వచ్చిందన్నారు. ముందుగానే రైతులు కోరినట్లుగా బొండాలు కొనుగో లుకు నిర్ణయం తీసుకుని ఉంటే రైతు ఇంత నష్టపోయేవాడు కాదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండడంతో ఇప్పుడు అధికా రులు ఉరుకులు పరుగులు పెడుతున్నారన్నారు. ఇప్పటి వరకు ఒక్క ప్రజా ప్రతినిధి కూడా రైతులను పరామర్శించిన పాపాన పోలేదని, రైతుకు భరోసా కల్పించలేని నేతలు ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు సిరసపల్లి నాగేశ్వరరావు, నాయకులు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, మామిడిశెట్టి శ్రీను, వెంకట సుబ్బారెడ్డి, సూర్రెడ్డి, శ్రీను, స్వామి, మల్లిడి సత్యనారాయణరెడ్డి, సత్తి దేవానందరెడ్డి పాల్గొన్నారు.