భూమి స్వాధీనం చేసుకున్న అధికారులు
ABN , First Publish Date - 2023-03-19T00:23:57+05:30 IST
అన్నవరం జాతీయ రహదారిపై విలువైన సుమారు 4.25 ఎకరాల భూమిని శనివారం ఇన్‌చార్జి ఈవో ఆజాద్ సంబంధిత అధికారులతో కలసి స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి కొంతకాలంగా కోర్టు వివాదంలో ఉంది. ఎంతోకాలంగా సాగుచేసుకుంటున్నందున ఈభూమి తనకే ద

అన్నవరం, మార్చి 18: అన్నవరం జాతీయ రహదారిపై విలువైన సుమారు 4.25 ఎకరాల భూమిని శనివారం ఇన్‌చార్జి ఈవో ఆజాద్ సంబంధిత అధికారులతో కలసి స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి కొంతకాలంగా కోర్టు వివాదంలో ఉంది. ఎంతోకాలంగా సాగుచేసుకుంటున్నందున ఈభూమి తనకే దక్కుతుందని ఒక రైతు కోర్టును ఆశ్రయించారు. ఒకపక్క కోర్టు వివాదంలో ఉండగానే దేవస్థానం సాగుచేసుకునేందుకు నిర్వహించిన వేలంలో కోర్టునాశ్రయించిన వ్యక్తే లీజు కు దక్కించుకున్నారు. మూడేళ్ల కాలపరిమితికి పిలిచిన బహిరంగవేలం గడువుముగియడంతో శనివారం స్వాధీనపరుచుకున్నారు. ఇ ప్పటివరకు స్టేట్‌సకోలో ఉన్న భూ వివాదం 6నెలల సమయం ముగిసిందని దేవస్థానంతరుపున కౌంటర్ వేశామని అధికారులు అన్నారు.