మండుటెండలో.. అంగన్వాడీల ఆందోళన

ABN , First Publish Date - 2023-02-07T01:26:51+05:30 IST

చిన్నారుల ఆలన పాలన కన్నా రాజకీయ నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పెత్తనాలు భరించలేకపోతున్నామని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ యూనియన్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు మాణిక్యాంబ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బొమ్మూరు కలెక్టరేట్‌ బయట సుమారు వెయ్యి మందికిపైగా అంగన్వాడీలు నడిరోడ్డుపై మండుటెండలో బైఠాయించారు. కలెక్టరేట్‌కు వెళ్లే దారి

మండుటెండలో.. అంగన్వాడీల ఆందోళన
కలెక్టరేట్‌ వద్ద బైఠాయించిన అంగన్వాడీ కార్యకర్తలు

కలెక్టరేట్‌ వద్ద ఏడు ప్రాజెక్టుల వర్కర్‌ల నిరసన

బొమ్మూరు, ఫిబ్రవరి 6: చిన్నారుల ఆలన పాలన కన్నా రాజకీయ నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పెత్తనాలు భరించలేకపోతున్నామని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ యూనియన్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు మాణిక్యాంబ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బొమ్మూరు కలెక్టరేట్‌ బయట సుమారు వెయ్యి మందికిపైగా అంగన్వాడీలు నడిరోడ్డుపై మండుటెండలో బైఠాయించారు. కలెక్టరేట్‌కు వెళ్లే దారి మొత్తం అంగన్వాడీలతో నిండిపోయింది. ఏడు ప్రాజెక్టుల అంగన్వాడీ కార్యకర్తలు ముక్తకంఠంతో నిరసన వ్యక్తంచేశారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ పట్టు విడవకుండా ఎండను భరిస్తూ తమ కష్టాలు ఏకరువు పెట్టారు. మాణిక్యాంబ, ప్రధాన కార్యదర్శి బేబిరాణి మాట్లాడుతూ అంగాన్వాడీల జీతాలు పెంచాలన్నారు. ఫేస్‌యాప్‌ తొలగించాలని, పనిభారం భరించలేకపోతున్నామని తెలిపారు. సచివాల య సిబ్బంది తమపై పెత్తనం వహిస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. ఉదయం నుంచి అధిక ఒత్తిడితో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. అంగన్వాడీలను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని డిమాండు చేశారు. ఫుడ్‌ కమిషనర్‌ వేధింపుల వల్ల అంగన్వాడీలు బాధపడుతున్నారన్నారు. సీపీఎం నాయకుడు అరుణ్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సుందర్‌ మాట్లాడుతూ సర్పంచ్‌లు, రాజకీయ నేతలు వేధిస్తూ తమ మాట వినకపోతే ఉద్యోగం తీసేస్తామని బెదిరించడం దారుణమన్నారు. కోర్టు ఉత్త ర్వుల మేరకు గ్రాడ్యుటీ అమలు చేయాలని కోరారు. దీంతో అంగన్వాడీలు, సీపీఎం, సీఐటీయూ నేతలతో డీఎస్పీ శ్రీలత చర్చ లు జరిపారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. కలెక్టరేట్‌ లోపలకి మాత్రం ఎవరిని అనుమతించకుండా కలెక్టరేట్‌ చుట్టూ ఉన్న గేట్లు మూసివేశా రు. కలెక్టరేట్‌ గేటు వద్దకు సైతం పోలీసులు అనుమతించకపోవడంపై నేతలు అసహనం వ్యక్తంచేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్య నేతలను మాత్రమే లోపలికి అనుమతించారు. దాంతో వారు కలెక్టర్‌కు తమ సమస్యలను ఏకరువు పె ట్టారు. ఒత్తిడి భరించలేకపోతున్నామని తెలిపారు. దీనిపై కలెక్టర్‌ మాధవీలత స్పం దిస్తూ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. కలెక్టర్‌ ను కలిసిన అనంతరం నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని, త్వరలో ఢిల్లీ వెళ్లి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. అంగన్వాడీలు సిద్ధంగా ఉండాల ని పిలుపునిచ్చారు. నిరసనలో రాజమహేంద్రవరం, రాజానగరం, కోరుకొండ, గోపాలపురం, రంగంపేట, సమిశ్రగూడెం, రాయవరం ప్రాజెక్టుల వారు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:26:52+05:30 IST