Share News

పోరు..హోరు

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:11 AM

సర్కారు దిగిరావాలి.. మా డిమాండ్లు తీర్చాలి.. మేమే మి అడుగుతున్నాం..సీఎం ఇచ్చిన హామీలనే అమలు చేయమని డిమాండ్‌ చేస్తున్నాం.. ఏమైనా కొత్తగా అడి గామా అంటూ అంగన్‌వాడీలు మండిపడుతున్నారు.

పోరు..హోరు
రాజమహేంద్రవరంలో నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు

మెట్టు దిగని అంగన్‌వాడీలు

సర్కారు దిగిరావాలని నినాదాలు

సమ్మె విరమించేదిలేదని హెచ్చరిక

మాకిచ్చిన హామీల మాటేమిటని ప్రశ్న

కళ్లకు గంతలు కట్టుకుని నిరసన

19 మండలాల్లో ఆందోళనలు

టీడీపీ..జనసేన..కాంగ్రెస్‌ మద్దతు

కేంద్రాల్లో పాఠాల్లేవ్‌..భోజనాల్లేవ్‌

ఇబ్బందులు పడుతున్న చిన్నారులు

(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)

సర్కారు దిగిరావాలి.. మా డిమాండ్లు తీర్చాలి.. మేమే మి అడుగుతున్నాం..సీఎం ఇచ్చిన హామీలనే అమలు చేయమని డిమాండ్‌ చేస్తున్నాం.. ఏమైనా కొత్తగా అడి గామా అంటూ అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. నాడు ఎన్నికల ముందు మరి నెరవేర్చని హామీలను ఎం దుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు వంద శాతం హామీలను అమలు చేసింది మా ప్రభుత్వమే అని గొప్ప లు చెప్పుకునే నేతలకు మాకు ఇచ్చిన హామీలు గుర్తు లేవా అంటూ బహిరంగంగా విమర్శిస్తున్నారు. తాళాలు బద్దలుకొట్టినంత మాత్రాన తాము లొంగేది లేదని.. తాడోపేడో తేల్చుకుంటామని భీష్మించారు. అంగన్‌వాడీల ఉద్యమం ఐదో రోజు శనివారం ఉధృతమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆందోళన కొన సాగించారు. రాజమహేంద్రవరంలోని ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు కళ్లకుగంతలు కట్టు కుని వినూత్న నిరసన చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఆందోళనలు కొనసాగాయి. తగ్గేదేలేదంటూ నిరసన ప్రదర్శన చేశారు. పక్క రాష్ట్రం కన్నా ఎక్కువ జీతం ఇస్తానని అబద్దాలు చెప్పి మోసం చేశారని ఆరోపించారు. తక్కువ జీతాలకే ఉదయం నుంచి సాయంత్రం వరకూ సేవ చేస్తున్నామన్నారు. అంగన్‌వాడీలకు టీడీపీ, జనసేన ,వామపక్షనేతలు అండగా నిలుస్తున్నారు.యువగళం పాద యాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకే శ్‌ ఇస్తున్న భరోసా అంగన్‌వాడీలకు కొండంత బలాన్ని స్తుంది. ధైర్యంగా పోరాడే బలాన్నిస్తుంది.

పిల్లలకు మధ్యాహ్నం భోజనంతో సరి

జిల్లాలో వేలాది మంది అంగన్‌వాడీ పిల్లలకు కేవలం మధ్యాహ్న పథకం కింద వండిన భోజనం పెట్టేసి సరి పెట్టేస్తున్నారు.వాస్తవానికి సమ్మెకు ముందు అంగన్‌ వాడీలన్నీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పనిచేసేవి. సమ్మె కారణంగా ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకూ మాత్రమే తెరుస్తు న్నారు. ప్రభుత్వం ఆ బాధ్యతను సచివాలయ ఉద్యోగు లకు అప్పగించింది.దీంతోయ జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నారు. వెనుక బడిన ప్రాంతాల్లో పిల్లలు బాగా హాజరవుతుండగా, కొన్ని చోట్ల సరిగ్గా రావడంలేదు. వచ్చిన వారికి కూర్చోపెట్టి భోజనం పెట్టి పంపిచేస్తున్నారు.ఇక ఆటపాటలు, పాఠాలు ఏమీ లేవు. చాలా మంది తల్లిదండ్రులు కూలీనాలీ చేసు కుని జీవిస్తుంటారు.వారి పిల్లలను అంగన్‌వాడీల్లో ఉంచి పనులకు వెళుతుంటారు. అంగన్‌వాడీల సమ్మెను ప్రభు త్వం పట్టించుకోకపోవడంతో అంగన్‌వాడీలతో పా టు,పి ల్లలు, బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వం దిగిరావాలి..

కొవ్వూరు : ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అంగన్‌వాడీల డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు మాణిక్యమ్మ డిమాండ్‌ చేశారు. కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం ముద్దు అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు శనివారం ఐదో రోజు సమ్మె కొనసాగించారు.నోటికి నల్లరిబ్బన్‌ కట్టుకుని నిరసన తెలిపారు. కొవ్వూరు అధ్యక్షురాలు సిహెచ్‌. పుష్పావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అం గన్‌వాడీలతో జరిపిన చర్చల్లో రూ. 13,500లు జీతం చెల్లిస్తున్నట్టు ప్రచారం చేస్తుందన్నారు.చర్చల బృందానికి అవగాహన ఉందో, లేదో, తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

తెలంగాణలో అలా.. ఏపీలో ఇలాగా?

పెరవలి : అంగన్‌వాడీసెంటర్‌ల తాళాలు పగులగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కేం ద్రాల్లో వంట సామాగ్రిని తమ ప్రమేయం లేకుండా స్వా ఽధీనం చేసుకున్నారని ఆరోపించారు.తెలంగాణలో రోజులు తరబడి సమ్మె చేసినా అంగన్‌వాడీలపై చర్య లేం లేవని..ఏపీలో మాత్రం సమ్మె ఆరంభించిన మూ డో రోజునే తాళాలు బద్దలు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆందోళనలో పెరవలి ప్రాజెక్టు నాయకులు రామలక్ష్మి, కన్యా కుమారి పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:11 AM