అనపర్తిలో మరో మట్టి దందాకు వైసీపీ అంకురార్పణ

ABN , First Publish Date - 2023-05-26T01:03:15+05:30 IST

అనపర్తి నియోజకవర్గంలో పాలకులకు గ్రావెల్‌ మట్టి దాహం తీరడం లేదని, బిక్కవోలు మండలం కాపవరంలోని వెదుళ్ల చెరువులో మట్టి దందాకు అంకురార్పణ చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాద్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

అనపర్తిలో మరో మట్టి దందాకు వైసీపీ అంకురార్పణ

  • టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి

అనపర్తి, మే 25: అనపర్తి నియోజకవర్గంలో పాలకులకు గ్రావెల్‌ మట్టి దాహం తీరడం లేదని, బిక్కవోలు మండలం కాపవరంలోని వెదుళ్ల చెరువులో మట్టి దందాకు అంకురార్పణ చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాద్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం అనపర్తిలోని టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు తమలంపూడి సుధాకరరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపవరంలోని వెదుళ్ల చెరువులో 9000 క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వుకునేందుకు ఇద్దరు రైతులకు అధికారులు అనుమతులు ఇచ్చారని, అయితే అక్కడ మూడు జేసీబీలతో సుమారు 50లారీలతో మట్టి రవాణా జరుగుతుందని అన్నారు. అనుమతులు ఇచ్చిన రైతులకు భూమి ఎంత ఉందో కూడా అధికారుల వద్ద సమాచారం లేదన్నారు. నాలుగు రోజుల క్రితం ఇళ్ళపల్లిలో మట్టి తవ్వకానికి ప్రయత్నించిన వారిని టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో పనులు నిలుపుదల చేశారన్నారు. గతంలో వెదుళ్ల చెరువు తవ్వకాలపై అనేక ఆరోపణలు చేశారని సీల్‌ లెవెల్‌ కన్నా ఎక్కువ తవ్వేశారని దీంతో ప్రమాదాలు కూడా జరిగాయని ఆరోపిం చారని, అయితే అంత లోతు తవ్విన చెరులో ఇప్పుడు అనుమతులు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మహానాడు తర్వాత ఈ విషయంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తుందని అనుమతులు ఎంత, తవ్వకాలు జరిపింది ఎంత, సొంత భూముల్లోకి తరలించింది ఎంత అని నిర్థారణ చేస్తామన్నారు. సమావేశంలో కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, తమలంపూడి సుదాకరరెడ్డి, మల్లిడి శ్రీని వాసరెడ్డి, సత్తి దేవదానరెడ్డి, గొలుగూరి భాస్కరరెడ్డి, ఒంటిమి సూర్యప్రకాష్‌, నూతిక బాబూరావు, తమలంపూడి సత్తిరెడ్డి, మామిడిశెట్టి శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T01:03:15+05:30 IST