అమ్మా భవానీ..
ABN , First Publish Date - 2023-10-16T00:41:29+05:30 IST
రత్నగిరివాసుడైన సత్యదేవుడు అమ్మవారు, శంకరులు ముత్యాల వస్త్రాలలో భక్తులకు దర్శనమిచ్చే శుభతరుణం సోమవారం నుంచి ప్రారంభంకానుంది.
దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
బాలాత్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన అమ్మవార్లు
నేటి నుంచి ముత్తంగి అలంకారంలో సత్యదేవుడి దర్శనం
స్వరూపానంద స్వామీజీతో తొలిపూజ
అన్నవరం, అక్టోబరు 15 : రత్నగిరివాసుడైన సత్యదేవుడు అమ్మవారు, శంకరులు ముత్యాల వస్త్రాలలో భక్తులకు దర్శనమిచ్చే శుభతరుణం సోమవారం నుంచి ప్రారంభంకానుంది. దేవస్థానం వ్రతపురోహిత సంఘం సుమారు రూ. 8.35లక్షల వ్యయంతో వీటిని తయారుచేయించి దేవస్థానానికి ఆదివారం సంఘ నాయకులు నాగాభట్ల రవిశర్మ, చామర్తి కన్నబాబు, కర్రి నాని, మహేంద్రవాడ జగదీష్ తదితరులు దేవస్థానం సహాయకమిషనర్ రమేష్‌బాబు ద్వారా ఆలయ ప్రధానార్చకులకు అందజేశారు. సోమవారం ఉదయం ముత్యాల వస్త్రాలంకరణలో తొలిపూజను ఉదయం 5గంటలకు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. ఇకపై ప్రతి సోమవారం మూలవిరాట్‌లు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ముత్యా ల వస్త్రాలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ము త్యాల వస్త్రాలంకరణ ఇప్పటివరకు దేశంలో శ్రీరంగం, తిరుమల మలయ్యప్ప స్వామి, భద్రాచలం శ్రీరామచంద్రులకు మాత్రమే అలంకరిస్తున్నారు. ఇది ప్రాచీనకళ అని దీనిని హైదరాబాద్‌కు చెందిన సుధీర్‌చరణ్ కుటుంబసభ్యులు తయారుచేశారు. క్లాత్‌పై ముత్యాలు, కెంపులు, నవరత్నాలతో వీటిని తీర్చిదిద్దారు. పండితులు మంత్రపూర్వకంగా అర్చకస్వాములు వీటిని స్వీకరించారు. కార్యక్రమంలో పీఆర్వో జగ్గారావు, ఏఈవో కృష్ణారావు, ఏపీఆర్వో లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు బాల త్రిపురసుందరిగా...
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు క్షేత్రరక్షకిగా పూజలందుకుంటున్న వనదుర్గ, కనకదుర్గ, దర్బారుమండపంలో ఏర్పాటుచేసిన దేవిలు బాల త్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా ద ర్బారు మండపంలో గణపతిపూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, మండపారాధన, మహాలింగార్చన, కౌమారి తదితర పూజలు నిర్వహించారు. సోమవారం కల్యాణ గౌరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు.
ద్రాక్షారామలో బాలాత్రిపుర సుందరిగా మాణిక్యాంబ
ద్రాక్షారామ, అక్టోబరు 15: అష్టాదశ శక్తిపీఠాల్లో ద్వాదశ శక్తిపీఠంగా వెలుగొందుతున్న భీమేశ్వరాలయంలో మాణిక్యాంబ అమ్మవారి సన్నిధిలో ఆది వారం దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఉదయం 7.15గంటలకు సంకల్పం జరిగింది. అనంతరం నంది మం డపంలో కలశస్థాపన మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వరలక్ష్మి దంపతులు, వాడ్రేవు సుందర రత్నాకరరావుచే బ్రహ్మశ్రీ దేవులపల్లి ఫణిరామకృష్ణ బ్రహ్మత్వంలో వేదపండితులు, రుత్వికులు గణపతిపూజ, రుత్విక్ వరుణ, కలశస్థాపన జరిపారు. అనంతరం భీమేశ్వరస్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. భీమేశ్వరాలయ చరిత్రలో తొలిసారిగా మాణిక్యాంబ అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. స్వామివారికి అభిషేకం అనంతరం బాలాత్రిపుర సుందరి అవతారంలో మాణిక్యాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చన, మహామంగళహారతి నిర్వహించారు. మద్యాహ్నం 1 నుంచి 3.30 వరకు శ్రీచక్రనవావర్ణార్చన జరిగింది. 6 గంటలకు ప్రదోషకాలార్చన, దూపసేవ, పల్లకీ సేవ అనంతరం 6.30 గంటలకు భక్తులచే లక్ష కుంకుమార్చన సువర్ణ, రజత పుష్పార్చన అనంతరం సప్తహారతులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పి.తారకేశ్వరరావు, ఆలయ అర్చకులు, సిబ్బంది, పాల్గొన్నారు. బాలాత్రిపురసుందరి అవతారంలో మాణిక్యాంబఅమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని మాణిక్యాంబ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పుష్పార్చన విశేషంగా ఆ కట్టుకుంది. పూలతో చేసిన శివలింగం, నంది సెట్టింగు ప్రత్యేకతగా నిలిచింది. వెంకటేశ్వర ఇండస్ట్రీస్ అధినేత సుబ్బారెడ్డిచే ప్రసాద వితరణ జరిపారు.
లోవలో కిక్కిరిసిన భక్తజనం
ఆలయానికి రూ.2.46 లక్షల ఆదాయం
తునిరూరల్, అక్టోబరు 15: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. లోవలో శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభంకావడంతో లోవకి తరలివచ్చే భక్తులసంఖ్య గణనీయంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తజనంతో క్యూలైన్‌లు కిక్కిరిశాయి. అమ్మవారిని బాలాలయంలో కనులారా తిలకించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా లోవకి తరలివచ్చిన భక్తులు దేవస్థానం సమకూర్చిన వసతి గదుల్లో వంటా వార్పులు చేసుకుని కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. భక్తుల సౌకర్యార్ధం ఆలయ ఈవో విశ్వనాథరాజు సూచనలు మేరకు అధికా రులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆదివారం ఒక్కరోజే భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా ఆలయానికి రూ.2.46లక్షల సమకూరిన ట్లు ఆలయ అధికారులు తెలిపారు.
పాదగయకు పోటెత్తిన భవానీలు
పిఠాపురం, అక్టోబరు 15: కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రానికి భవానీ భక్తులు పోటెత్తారు. విజయదశమి నవరాత్రుల తొలిరోజున భవానీమాలలు ధరించేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో పాదగయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. కుక్కుటేశ్వరస్వామి సన్నిధిలోని రాజరాజేశ్వరిదేవి, అష్టాదశ శక్తి పీఠాల్లో పదవశక్తి పీఠంగా పుర్హుతికాఅమ్మవారి సన్నిధిలో భవానీమాలలు ధరించారు. ఆలయ అర్చకులు వీరికి భవానీ మాలలు ధరింప చేసి పూజలు నిర్వహించారు. ఆది వారం ఒక్కరోజే నాలుగువేలమందికిపైగా భక్తులు భవానీమాలలు ధరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ పాదగయ క్షేత్రంలో 11వేల మందికిపైగా భక్తులు భవానీదీక్ష స్వీకరించినట్లు చెప్పారు. భక్తులకు ఎటు వంటి ఆసౌకర్యం కలుగకుండా ధర్మకర్తల మండలి చైర్మన్ ఆగంటి ప్రభాకరరావు, ఈవో వడ్డి శ్రీనివాసరావులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
పీఠంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు
రాయవరం, అక్టోబరు 15: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గాపీఠంలో 52వ దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుతగా విజయదుర్గా అమ్మవారిని రజత కవచ అలంకరణచేసి ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించారు. వేదపండితుడు చీమలకొండ వీరావధాని ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు వినాయకపూజ, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం ఉదయం 8.30కు అమ్మవారి మూలవిరాట్ వద్ద కలశస్థాపనచేసి నవరాత్రి వేడుకలను ప్రారంభించారు. అనంతరం వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు అమ్మవారివద్ద కలశ స్థాపన చేశారు. భక్తులనుద్దేశించి పీఠాధిపతి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. దేవీ శరన్నవరాత్రుల విశిష్టత, నవరాత్రి దీక్షలు చేపట్టడంవల్ల కలిగే శుభాలు భక్తులకు వివరించారు. పీఠంలో ఐఆర్‌ఎస్ అధికారి రమణారెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని గాడ్ ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పీఆర్వో బాబి, విజయదుర్గా సేవాసమితి సభ్యులు బి.రమా, జి.సత్యవెంకట కామేశ్వరి, భాస్కరనారాయణ, పెద్దపాటి సత్య కనకదుర్గ, అన్నవరం దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యుడు కందర్ప హనుమాన్, గొర్తి సుబ్రహ్మణ్యశాస్త్రి, భక్తులు పాల్గొన్నారు.
ఙదుర్గాదేవి అమ్మవారికి బోనాలు..
రౌతులపూడి, అక్టోబర్ 15: రౌతులపూడి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమ య్యాయి. ఆదివారం అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. మండ లంలోని అన్ని గ్రామాల్లో అమ్మవారి ఆలయాల వద్ద దసరా మహోత్సవాలు ప్రారంభం కాగా బోనాలు సమర్పించారు. రౌతులపూడి అమ్మ వారు బాలత్రిపుర సుందరిదేవిగా దర్శినమిచ్చారు.
రాజమహేంద్రింలో శ్రీస్వర్ణకవచ కనకదుర్గాదేవిగా
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 15: రాజమహేంద్రవరం దేవీచౌక్‌లో 90వ శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 15నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయి. దేవీచౌక్‌లో బాలాత్రిపుర సుందరిదేవి ఆలయంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కంకుమపూజలు, ఆధ్యాత్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి వేళలో నాటక ప్రదర్శనలు నిర్వహించారు. అమ్మవా రు భక్తులకు శ్రీస్వర్ణకవచ కనక దుర్గాదేవి ఆలంకరణలో దర్శనమిచ్చారు. దేవీచౌక్‌లో నలుదిక్కులా ఏర్పాటుచేసిన భారీ లైటింగ్ సెట్టింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పిల్లలకు దసరా సెలవులు ఇవ్వడంతో ఉత్సవాలు తిలకించేందుకు వస్తున్నారు. రాత్రి 10గంటలకు కనకదుర్గ మహత్మ్యం నాటకం ప్రదర్శించారు.
నేడు శ్రీ అన్నపూర్ణాదేవిగా..
దేవీచౌక్ దసర ఉత్సవాల్లో సోమవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శన ఉంటుంది.
డారు.