అమలాపురం టౌన్ బ్యాంకు లాభం రూ.1.03 కోట్లు
ABN , First Publish Date - 2023-06-26T00:08:13+05:30 IST
అమలాపురం కో-ఆపరే టివ్ టౌన్ బ్యాంకు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం లో రూ.84కోట్ల మేర వ్యాపారం నిర్వహించినట్టు చైర్మన్ డాక్టర్ మెట్ల వెంకటసూర్యనారాయణ తెలిపారు.
అమలాపురంటౌన్, జూన్ 25: అమలాపురం కో-ఆపరే టివ్ టౌన్ బ్యాంకు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం లో రూ.84కోట్ల మేర వ్యాపారం నిర్వహించినట్టు చైర్మన్ డాక్టర్ మెట్ల వెంకటసూర్యనారాయణ తెలిపారు. రూ.1.03 కోట్లు లాభం వచ్చిందన్నారు. టౌన్ బ్యాంకు 25వ వార్షిక మహాజన సభను ఆదివారం డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు కాపు కల్యాణ మండ పంలో చైర్మన్ సూర్యనారాయణ అధ్యక్షతన నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులో రూ.48కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, వివిధ రంగాలకు రూ.35కోట్లు రుణాలుగా అందజేశా మన్నారు. సభ్యులకు ఈ ఏడాది 13శాతం డివిడెండ్ ప్రక టిస్తున్నట్టు తెలి పారు. 2022-23 ఆడిట్ రిపోర్టును, 2023-24, 2024-25 అంచనా బడ్జెట్‌లను మేనేజింగ్ డైరెక్టర్ శిరగం వేణు గోపాలరావు ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. వైస్‌చైర్మన్ ఎండీ అమీర్, డైరెక్టర్లు మెట్ల రమణబాబు, డాక్టర్ బి.రాఘవేంద్రరావు, డాక్టర్ వెంకట్రావు, డాక్టర్ గొల కోటి రంగారావు, అల్లాడ శ్రీనివాస్, చింతా శంకరమూర్తి, జాన్‌పాల్, నూలు సురేష్, బ్రాంచి మేనేజర్ చిక్కం బాబు, డాక్టర్ బసవా వరహాలు, డాక్టర్ కొప్పినీడి వెంకట రమణకుమార్ పాల్గొన్నారు.