చంద్రబాబును విడుదల చేయకపోతే.. ప్రజా ఉద్యమం
ABN , First Publish Date - 2023-09-18T00:34:47+05:30 IST
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో పడిందని అఖిలపక్ష నేతలు అన్నారు.టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,మాజీ ముఖ్యమంత్రి నా రా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన రాజమహేంద్రవరం హోటల్ జగదీశ్వరీలో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం నిర్వహించారు.

అందరి మాటా ఒక్కటే
బాబు అరెస్టు అన్యాయం
బేస్‌లెస్ కేసులో అరెస్టా?
బాబు నిర్దోషిగా బయటకు..
అన్ని రాజకీయపక్షాల మద్దతు
చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్
రాజమహేంద్రవరం సిటీ,సెప్టెంబరు 17 : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో పడిందని అఖిలపక్ష నేతలు అన్నారు.టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,మాజీ ముఖ్యమంత్రి నా రా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన రాజమహేంద్రవరం హోటల్ జగదీశ్వరీలో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం నిర్వహించారు.దీనిలో భాగంగా అఖిలపక్ష నాయకులు జగన్ తీరుపై మండిపడ్డా రు.అన్యాయంగా చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెట్టారని మండిపడ్డారు. వెంటనే విడు దల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమా వేశంలో నాయకులు ఎస్‌ఎస్ మూర్తి, సీపీఐ నాయకురాలు యడ్ల లక్ష్మి, జట్టు యూనియన్ నాయకులు సప్పా రమణ, సీపీఐ నగర అధ్యక్షుడు వి.కొండలరావు, టీడీపీ నాయకులు రాచపల్లి ప్రసాద్, శెట్టి జగదీష్, ద్వారా పార్వతి సుందరి, సీపీఐ నాయకులు నల్లా రామారావు, కె.శ్రీనివాస్,మానుకొండ కృష్ణ పాల్గొన్నారు.
వైసీపీ జేబుసంస్థగా సీబీసీఐడీ.
జగన్ లాంటి అరాచక శక్తులు పాలకులైతే ప్రజలకు ఇబ్బందులు తప్పవు.. వైసీపీ ప్రభుత్వానికి సీబీ సీఐడీలు జేబు సంస్థలుగా మారాయి. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సక్రమంగా లేదు. చాలా లోపాలు ఉన్నాయి. చంద్రబాబుపై పెట్టిన ఈ కేసులు న్యాయస్థానాల్లో నిలబడవు.. చాలా కుట్రపూరితంగా ఇరికించారు.ఇలాంటివాటిని ప్రజలు ఖండించాలి. - ముప్పాళ్ళ సుబ్బారావు, ప్రముఖ న్యాయవాది
చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారు..
మా నాయకుడు చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నేరుగా ఎదుర్కొనలేక నిరాధార మైన కేసును పెట్టి జైలులో పెట్టారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఎన్నడూ చూడలేదు. చంద్రబాబును అక్రమంగా ఇరికించిన వారిని వదిలిపెట్టం.చంద్రబాబుకే ఇలాంటి పరిస్థితి వస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. - ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్సీ
అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడంలేదు
రాష్ట్రంలో అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదు. అన్నీ ఉల్లంఘనలే. అంతా అరాచకమే. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు విషయంలోనే తప్పుడు కేసు తప్పలేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు.రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు .
- గన్నికృష్ణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అన్యాయం ఎక్కువ కాలం నడవదు...
చంద్రబాబు అరెస్ట్‌తో న్యాయవ్యవస్థపై నమ్మకం పోయేలా ఉంది. అన్యాయం ఎక్కువకాలం నడవదు. చంద్రబాబు నిర్ధోిషగా బయటకు వస్తారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. అతి త్వరలో శాంతి ర్యాలీ చేస్తాం.
- తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి
జగన్ పడవ మునిగిపోబోతుంది
జగన్ పడవ మునిగిపోబోతుంది. చంద్రబాబు మంచి అడ్మినిస్ర్టేటర్. అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసే ముందు దాని వల్ల సంభంవించే పరిణామాలు ఆలోచించుకోవాలి. కానీ అలా చేయలేదు. అందుకే జగన్ పని అయిపోయింది. చంద్రబాబు అరెస్ట్‌ను ఇండియా కూటమి ఖండించింది. - బాలేపల్లి మురళీధర్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు
సీఎం అరాచక పాలనను ఖండించాలి
సీఎం జగన్ అరాచక పాలనను ప్రతి ఒక్కరు ఖండించాలి.ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ నియంతృత్వ పాలన ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసే వరకు వచ్చింది. ఇది అన్యాయం.చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసు లు ఎత్తివేయాలి.- అక్కినేని వనజ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు
చంద్రబాబును అరెస్ట్ చేసిన పద్ధతి సరికాదు
చంద్రబాబును అరెస్ట్ట్ చేసిన పద్ధతి బాగోలేదు. కేసులో ఆధారాలు లేకుం డా ఎలా అరెస్టులు చేస్తారు. 14 ఏళ్లపాటు సీఎంగా పని చేసిన నాయకుడిని అరెస్టే చేసేటప్పుడు బేస్‌లెస్‌గా ఎలా చేస్తారు. పోలీస్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేసింది. ప్రభుత్వ తప్పులు ప్రశ్నిస్తే అరెస్టులు దారుణం. - బి.పవన్, సీపీఎం నాయకుడు
చంద్రబాబు అరెస్టు రాష్ర్టానికి అప్రతిష్ట
జి-20 దేశాల సమావేశాలు జరుగుతున్న సమయంలో అక్రమ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడం దేశానికి అప్రతిష్ట కాదా. ఎందుకు జగన్‌ను కేంద్రం కట్టడి చేయలేకపోతుంది. చంద్రబాబు అరెస్ట్ చాలా ఘోరం ఇది దుర్మార్గమైన చర్య.మందాకృష్ణ మాదిగ ఆదేశాలతో నిరసన చేపడతాం. - వైరాల అప్పారావు, ఎమ్మార్పీఎస్
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి
జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు.ఈ సైకో నుంచి రాష్ట్రాన్ని ,ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశాడు. నాలుగేళ్ళుగా ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టారు. జగన్ మానసిక స్థితి బాగోలేదు. అతనికి వైద్యం అవసరం. ఇలానే వదిలేయడం ప్రమాదం. - అనుశ్రీ సత్యనారాయణ, వై.శ్రీను, జనసేన నేతలు
ఆర్థిక నేరగాడు జగన్‌ను ఇంటికి పంపించాలి
ఆర్థిక నేరగాడు జగన్ ఆలోచన విధానాలతో గత నాలుగేళ్ళుగా ప్రజలు నలిగిపోతున్నారు.చంద్రబాబు ను అక్రమంగా కేసుల్లో ఇరికించాడు. జగన్‌ను ఇంటికి పంపించే సమయం అసన్నమైంది.ఈ నియంత పాలనపై పోరాటం ఆగదు.- కాశి నవీన్ కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి