వైభవంగా అగస్తేశ్వరస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2023-01-25T00:41:06+05:30 IST

బాలాత్రిపుర సుందరి అగస్తేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని మం గళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు.

వైభవంగా అగస్తేశ్వరస్వామి కల్యాణం

ధవళేశ్వరం, జనవరి 24 : బాలాత్రిపుర సుందరి అగస్తేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని మం గళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. స్వయం భూ అగస్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వేడుకగా చేశారు.ఈ నెల 23వ తేదీన స్వామి అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లి కుమా ర్తెలు గా అలంకరించి ప్రత్యేక పూజలు చేసి గ్రామో త్సవం నిర్వహించారు.రాత్రి స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని అశేష భక్తజనం మధ్య కన్నుల పండువగా నిర్వహిం చారు.గ్రామ సభాపతి మంగళం పల్లి చంద్రశేఖర శాస్త్రి పర్య వేక్షణలో ఆలయ అర్చకులు విశ్వనాఽథ శర్మ, చిన్నా శర్మ కల్యాణం నిర్వహించారు. 29న పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి.

Updated Date - 2023-01-25T00:41:06+05:30 IST