బాబు కోసం ఓ మహిళ పాద యాత్ర

ABN , First Publish Date - 2023-09-26T01:29:00+05:30 IST

అనపర్తి/మండపేట, సెప్టెంబరు 25: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విడుదల కావాలని కోరుతూ కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన టీడీపీ మండల మహిళా ప్రధాన కార్యదర్శి వల్లూరి శ్రీవాణి సోమవారం ఒంటరిగా పాదయాత్ర ప్రారంభించారు. చంద్రబాబును జైలు నుంచి విడుదల చేసే వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా పాద

బాబు కోసం ఓ మహిళ పాద యాత్ర

అనపర్తి/మండపేట, సెప్టెంబరు 25: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విడుదల కావాలని కోరుతూ కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన టీడీపీ మండల మహిళా ప్రధాన కార్యదర్శి వల్లూరి శ్రీవాణి సోమవారం ఒంటరిగా పాదయాత్ర ప్రారంభించారు. చంద్రబాబును జైలు నుంచి విడుదల చేసే వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా పాదయాత్ర చేస్తా నని ఆమె వెల్లడించారు. సోమవారం కేశవరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర జెడ్‌.మేడపాడు, ద్వారపూడి మీదుగా కెనాల్‌ రోడ్డు నుంచి అనపర్తి మండలానికి చేరుకుంది. అనపర్తి మీదుగా మండపేటకు చేరుకుని అక్కడ నుంచి రాజమహేంద్రవరం రూరల్‌ మీదుగా కోనసీమలో తన యాత్ర నిర్వహిస్తానని చెప్పారు.

Updated Date - 2023-09-26T01:29:00+05:30 IST