కట్నం వేధింపులపై కేసు నమోదు
ABN , First Publish Date - 2023-03-19T02:11:04+05:30 IST
అదనపు కట్నం వేధింపులపై వివాహిత చేసిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.

ఆత్రేయపురం, మార్చి 18: అదనపు కట్నం వేధింపులపై వివాహిత చేసిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు. ఆత్రేయపురానికి చెందిన కోలమూరి నాగదేవికి చాగల్లు మండలం మూర్కండపాడుకు చెందిన సతీష్‌కుమార్‌తో 2010లో వివాహమైంది.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు శారీరకంగా, మానసికంగా వేధించడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. దీనిపై శనివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.