26 ఎకరాల్లో జీడిమామిడి తోట దగ్ధం

ABN , First Publish Date - 2023-03-05T23:00:51+05:30 IST

మండలంలోని బయ్యవరం కొండపై ఆదివారం సాయంత్రం జీడిమామిడి తోటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

26 ఎకరాల్లో జీడిమామిడి తోట దగ్ధం
మంటల్లో తగలబడుతున్న జీడిమామిడి చెట్లు

  • బయ్యవరం కొండపై ఘటన.. అగ్నికి ఆహుతైన చెట్లు

తాళ్లపూడి, మార్చి 5: మండలంలోని బయ్యవరం కొండపై ఆదివారం సాయంత్రం జీడిమామిడి తోటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాగోల పల్లి ప్రాంత ఎస్సీ మహిళా రైతులకు చెందిన బయ్యవరం గ్రామంలోని సర్వే నెంబరు 40లోని జీడిమామిడి పొలాల్లో మంటలు సంభవించి సుమారు 26 ఎకరాల్లో కాపుకు వచ్చిన చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామస్థుల సహకారంతో కొవ్వూరుకు చెందిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు, పంట నష్టం అంచనాలు తెలియాల్సి ఉంది. రైతులు చేతికి రాబోతున్న పంట అగ్నికి ఆహుతవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-03-05T23:00:51+05:30 IST