2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం : జేసీ

ABN , First Publish Date - 2023-04-16T01:34:38+05:30 IST

మండలాల పరిధిలో 233 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించనున్నట్టు ఇన్‌చార్జి కలెక్టర్‌ తేజ్‌భరత్‌ తెలిపారు

2.50 లక్షల మెట్రిక్‌     టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం : జేసీ

రాజమహేంద్రవరం రూరల్‌ ఏప్రిల్‌15: జిల్లాలోని 18 మండలాల పరిధిలో 233 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించనున్నట్టు ఇన్‌చార్జి కలెక్టర్‌ తేజ్‌భరత్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈనెల 16 నుంచికార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆన్‌లైన్‌ విధానం ద్వారా, ఈక్రాప్‌ నమోదు చేసుకొని ఈకేవైసీ చేయించుకొన్న రైతులు ఈ అవకాసం వినియోగించుకోగలుగుతారన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 6గంటల వరకు పని సమయంలో షెడ్యూలింగ్‌ చేసుకోవాలన్నారు. షెడ్యూలింగ్‌ చేసుకొన్న రైతులకు గన్నీబ్యాగ్‌లు, లేబర్‌, రవాణాకు సంబంధించి రైతు తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకొన్నట్లయితే వాటిని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చెల్లింపులు చేయడం జరుగుతుందన్నారు. లేకపోతే వాటిని ప్రభుత్వమే ఏర్పాటుచేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈసారి మద్దతు ధర రూ.2040గా నిర్ణయించడం జరిగిందన్నారు. మండల స్పెషల్‌ ఆఫీసర్లకు, తహశీల్దార్లకు, ఎంపీడీవో, ఎంఏఓవో లకు ప్రత్యేకశిక్షణ ఇవ్వడంతోపాటు ఆదేశాలు కూడా జారీచేసినట్టు చెప్పారు. సమస్యల పరిస్కారం కోసం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేశామని, మొబైల్‌, వాట్సాప్‌ నంబరు 8309487151, ల్యాండ్‌లైన్‌ 0883-2940788కుఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఇక మండల స్ధాయిలో ఎంపీడీవో కార్యాలయం, డివిజన్‌ పరిధిలో ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేశామని,. అన్ని మం డలాల కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు.

Updated Date - 2023-04-16T01:34:38+05:30 IST