AP News: పచ్చని చెట్ల నరికివేత.. ప్రజల ఆగ్రహం
ABN , First Publish Date - 2023-11-21T15:16:08+05:30 IST
నగరంలోని పోరంకి వద్ద పచ్చని చెట్లను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నరివేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ: నగరంలోని పోరంకి వద్ద పచ్చని చెట్లను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నరివేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు నాటమని ఓ పక్క చెబుతూనూ మరోవైపు వీఎంసీ సిబ్బంది మొక్కలు నరికేస్తున్న పరిస్థితి. తమ పై అధికారులు ఆజ్ఞ మేరకు చెట్లను నరుకుతున్నామని సిబ్బంది చెబుతున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం, యాక్సిడెంట్లు జరుగుతున్నాయనే వంకతో పోరంకి మున్సిపల్ కార్పొరేషన్ చెట్లను నరుకివేతకు పూనుకుంది. పాదచారులు సేద తీరేందుకు ఒక పచ్చని చెట్టు కూడా లేకుండా వీఎంసీ యాజమాన్యం చెట్లను నరుకుతున్న పరిస్థితి. కోట్ల రూపాయలు వెచ్చించి మొక్కలు నాటేందుకు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం.. అవి కొద్దిగా ఎదిగిన తర్వాత మళ్లీ వాటిని నరికి వేయిస్తుండటం విమర్శలు తావిస్తోంది. పచ్చని చెట్లను నరకడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.