CM JAGAN: రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన
ABN , First Publish Date - 2023-11-10T21:20:58+05:30 IST
రేపు (శనివారం) ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు.
అమరావతి: రేపు (శనివారం) ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలలో సీఎం జగన్ పాల్గొంటారు. ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి జగన్ చేరుకుంటారు. అక్కడ మైనారిటీస్ వెల్పేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.