గజ సంచారం

ABN , First Publish Date - 2023-06-01T01:57:54+05:30 IST

పాకాల మండలంలోని గుండ్లగుట్టపల్లె సమీపంలోని భూమికట్టవద్ద మంగళవారం రాత్రి ఏనుగుల గుంపు సంచరించింది. ఏనుగులు రోడ్డుపై రావడంతో వాహనదారులు భయపడ్డారు.

గజ సంచారం
పాకాల మండలం పదిపుట్లబైలు పంచాయతీ భూమికట్ట సమీపంలో రోడ్డుపైకొచ్చిన ఏనుగు

- భీతిల్లుతున్న గ్రామీణ జనం

పాకాల, మే 31: పాకాల మండలంలోని గుండ్లగుట్టపల్లె సమీపంలోని భూమికట్టవద్ద మంగళవారం రాత్రి ఏనుగుల గుంపు సంచరించింది. ఏనుగులు రోడ్డుపై రావడంతో వాహనదారులు భయపడ్డారు.మామిడి, అరటి, పనస, టమోటా పంటలను ధ్వంసం చేస్తూ తీవ్ర నష్టం కల్గిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. అర్ధరాత్రి దాటాక ఐరాల మండలం కాకర్లవారిపల్లె సమీపంలోని పొలాల వద్దకు చేరుకున్నాయని చెప్పారు. నెల రోజుల నుంచి పదిపుట్లబైలు, పేరసానిపల్లె, దామలచెరువు పంచాయతీల పరిధిలో ఇవి సంచరిస్తూ పంటలకు నష్టం కలిగిస్తున్నాయని, వీటిని ఇక్కడి నుంచి తరిమేసేందుకు చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్‌ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడులతో రాత్రిపూట కంటిమీద కునుకు లేకుండా పోతోందంటున్నారు. టపాకాయలు కాల్చి బెదరగొట్టినా.. మళ్లీ మళ్లీ పొలాల్లోకి వస్తున్నాయని వాపోయారు.

Updated Date - 2023-06-01T01:57:54+05:30 IST