విద్యా.. వసతి దీవెనేది జగనన్నా?
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:30 PM
విద్యార్థులకు గడువు దాటినా విద్యా దీవెన.. వసతి దీవెన నిధులు జమ చేయకపోవడంపై తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ) ఆగ్రహం వ్యక్తంచేసింది. సత్వరమే నిధులు విడుదల చేయాలని డిమాండు చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది.
‘స్పందన’ లేదన్నా తరలివచ్చిన అర్జీదారులు
చిత్తూరు, డిసెంబరు 18: విద్యార్థులకు గడువు దాటినా విద్యా దీవెన.. వసతి దీవెన నిధులు జమ చేయకపోవడంపై తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ) ఆగ్రహం వ్యక్తంచేసింది. సత్వరమే నిధులు విడుదల చేయాలని డిమాండు చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ అధ్యక్షుడు ప్రభుతేజ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు క్రమం తప్పకుండా ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరయ్యేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమ్మఒడి పేరుతో ఒక్కరికి మాత్రమే స్కాలర్‌షిప్పు ఇస్తున్నారన్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్, నర్శింగ్, డిప్లొమా, ఐటీఐ విద్యార్థులకు నాలుగేళ్లుగా నాలుగు విడతల బకాయిలు ఇంకా జమకాలేదన్నారు. గత ప్రభుత్వం 19 లక్షల మందికి స్కాలర్‌షిప్పులు మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం కేవలం 9 లక్షల మందికే ఇస్తోందన్నారు. నాలుగో విడతగా ఇవ్వాల్సిన నిధులను జమ చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లను ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఈ ధర్నాలో టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నాయకులు శ్యామ్‌ప్రసాద్, రాజ్‌కుమార్, సందీప్, భరత్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.