బకాయిలు ఎప్పుడు ఇప్పిస్తున్నారు... ఫ్యాక్టరీ ఎప్పుడు తెరిపిస్తున్నారు

ABN , First Publish Date - 2023-04-25T00:46:26+05:30 IST

నిండ్ర నేతమ్స్‌ షుగర్స్‌ ఫ్యాక్టరీ రైతులకు ఉన్న బకాయిలన్నింటిని చెల్లించేలా చేస్తానని, మూతబడిన ఫ్యాక్టరీని తెరిపించి రైతులను ఆదుకుంటానని ఇచ్చిన హామీ ఏమైంది అంటూ మంత్రి రోజాకు నేతమ్స్‌ షుగర్స్‌ ఫ్యాక్టరీ ఎదుట నుంచి నగరి టీడీపీ ఇన్‌చార్జి గాలి భానుప్రకాష్‌ సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు.

బకాయిలు ఎప్పుడు ఇప్పిస్తున్నారు... ఫ్యాక్టరీ ఎప్పుడు తెరిపిస్తున్నారు
నిండ్ర నేతమ్స్‌ షుగర్స్‌ ఫ్యాక్టరీ ఎదుట సెల్ఫీ ఛాలెంజ్‌ చేస్తున్న గాలి భానుప్రకాష్‌

మంత్రి రోజాకు గాలి భానుప్రకాష్‌ సెల్ఫీ ఛాలెంజ్‌

నిండ్ర, ఏప్రిల్‌ 24: నిండ్ర నేతమ్స్‌ షుగర్స్‌ ఫ్యాక్టరీ రైతులకు ఉన్న బకాయిలన్నింటిని చెల్లించేలా చేస్తానని, మూతబడిన ఫ్యాక్టరీని తెరిపించి రైతులను ఆదుకుంటానని ఇచ్చిన హామీ ఏమైంది అంటూ మంత్రి రోజాకు నేతమ్స్‌ షుగర్స్‌ ఫ్యాక్టరీ ఎదుట నుంచి నగరి టీడీపీ ఇన్‌చార్జి గాలి భానుప్రకాష్‌ సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు. నిండ్ర మండలం నేతమ్స్‌ షుగర్స్‌ ఫ్యాక్టరీ రైతులకు సుమారు రూ.36 కోట్లు బకాయిలు పెట్టి, ఫ్యాక్టరీని 2020లో మూసివేశారు. తాను ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉన్నందున యాజమాన్యంతో మాట్లాడి రైతులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటిని ఇప్పిస్తానని, ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తానని రోజా హామీ ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఇంత వరకు పట్టించుకోలేదని భానుప్రకాష్‌ విమర్శించారు. ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్న రోజాకు రైతుల తరపున సెల్ఫీ ఛాలెంజ్‌ విసురుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ చైర్మన్‌గా, మంత్రిగా ఉండి నియోజకవర్గ రైతులకు ఏమి ప్రయోజనం అని ప్రశ్నించారు. కార్యక్రమంలో రైతులు వెంకటేశ్వరరావు, గంగాధరం నాయుడు, శరవణ, గాలి రమే్‌ష నాయుడు, పరదేశి, రాము, కోటి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-25T00:46:26+05:30 IST