వైసీపీకి చరమగీతం పాడాలి
ABN , First Publish Date - 2023-11-20T00:25:47+05:30 IST
రాష్ట్రంలో వైసీపీకి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పసుపులేటిహరిప్రసాద్, పూతలపట్టు టీడీపీ ఇన్‌చార్జి మురళీమోహన్ అన్నారు.

కాణిపాకంలో టీడీపీ, జనసేన సమన్వయ సమావేశం
ఐరాల(కాణిపాకం), నవంబరు 19: రాష్ట్రంలో వైసీపీకి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పసుపులేటిహరిప్రసాద్, పూతలపట్టు టీడీపీ ఇన్‌చార్జి మురళీమోహన్ అన్నారు. ఆదివారం సాయంత్రం కాణిపాకంలో జరిగిన టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశంలో వీరు మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే జనసేన, టీడీపీ కలిశాయన్నారు. వైసీపీ ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతి, అన్యాయాలను ప్రజలకు తెలియజెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఉచితాలకు తల వంచితే జీవితంలో తలెత్తుకోలేరన్నారు. రాష్ట్రంలో ప్రశాంతత నెలకొని ప్రజలు హాయిగా జీవించాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు గిరిధర్‌బాబు, నాయకులు మణి నాయుడు, మధుసూదన్‌రావు, వీడీబీ హరిబాబు నాయుడు, లత, పూతలపట్టు జనసేన ఇన్‌చార్జి తులసీప్రసాద్, ఏపీ శివయ్య, తులసీప్రసాద్, శివప్రసాద్, చంద్రయ్య, పురుషోత్తం, కుమార్, శివ,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.