వలంటీర్లు సమ్మెలోకి వెళ్ళడం లేదు: డీఆర్వో
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:58 PM
జిల్లాలోని వలంటీర్లు ఎవరూ సమ్మెలోకి వెళ్లడం లేదని డీఆర్వో రాజశేఖర్ అన్నారు. ఈ విషయమై వస్తున్న వార్తలు నిరాధారమన్నారు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 26: జిల్లాలోని వలంటీర్లు ఎవరూ సమ్మెలోకి వెళ్లడం లేదని డీఆర్వో రాజశేఖర్ అన్నారు. ఈ విషయమై వస్తున్న వార్తలు నిరాధారమన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో జిల్లా వలంటీర్ల సంఘం నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో వలంటీర్లు పాలుపంచుకుంటున్నారని చెప్పారు. జిల్లా వలంటీర్ల సంఘం అధ్యక్షుడు కె.వేణు మాట్లాడుతూ జిల్లానుండి వలంటీర్లెవ్వరూ సమ్మెలోకి వెళ్ళడం లేదని చెప్పారు. సీఎం జగన్ వలంటీర్లకు ఇచ్చిన హామీమేరకు తమ విధులను బాధ్యతగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.