22న వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవం
ABN , First Publish Date - 2023-06-26T01:41:02+05:30 IST
శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ 12వ స్నాతకోత్సవాన్ని జూలై 22న ఉదయం 10 గంటలకు వెటర్నరీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు రిజిస్ర్టార్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణాచలం రవి తెలిపారు
తిరుపతి(విద్య), జూన్ 25: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ 12వ స్నాతకోత్సవాన్ని జూలై 22న ఉదయం 10 గంటలకు వెటర్నరీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు రిజిస్ర్టార్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణాచలం రవి తెలిపారు. వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ స్నాతకోత్సవానికి చాన్సలర్ హోదాలో గవర్నరు అబ్దుల్ నజీర్ పాల్గొని, విద్యార్థులకు స్నాతకోత్సవ డిగ్రీలు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా కేరళకు చెందిన వెటర్నరీ అండ్ అనిమల్ సైన్సెస్ వర్సిటీ వీసీ డాక్టర్ ఎంఆర్ శసీంద్రనాథ్ హాజరుకానున్నారని వివరించారు.