నిప్పులగుండం

ABN , First Publish Date - 2023-06-03T01:24:01+05:30 IST

జిల్లాలో శుక్రవారం ఉష్ణోగ్రతలు నిప్పులగుండాన్ని తలపించాయి. తేలికపాటి వర్షం కురుస్తూనే ఉన్నా.. ఉష్ణోగ్రతలూ పెరుగుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు.

నిప్పులగుండం
నిర్మానుష్యంగా ఉన్న చిత్తూరులోని రాజీవ్‌గాంధీ రోడ్డు

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 2: జిల్లాలో శుక్రవారం ఉష్ణోగ్రతలు నిప్పులగుండాన్ని తలపించాయి. తేలికపాటి వర్షం కురుస్తూనే ఉన్నా.. ఉష్ణోగ్రతలూ పెరుగుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. శుక్రవారం అత్యధికంగా నిండ్ర మండలంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 8 గంటల నుంచే ఎండ ప్రభావం కనిపించింది. మండలాలవారీగా శ్రీరంగరాజపురంలో 41.1, గుడిపాలలో 40.9, చిత్తూరులో 40.8, కార్వేటినగరంలో 40.8, వెదురుకుప్పంలో 40.8, విజయపురంలో 40.8, తవణంపల్లెలో 40.7, పాలసముద్రంలో 40.1, నగరిలో 39.9, గంగాధరనెల్లూరులో 39.8, ఐరాలలో 39.5, పూతలపట్టులో 39.1, యాదమరిలో 38.5, పెద్దపంజాణిలో 38.4, పలమనేరులో 38.2, పెనుమూరులో 38.2, బంగారుపాళ్యంలో 37.6, గంగవరంలో 37.5, చౌడేపల్లెలో 37, సోమలలో 36.9, పుంగనూరులో 36.6, రొంపిచెర్లలో 36.5, సదుంలో 36.5, పులిచెర్లలో 36.4, వి.కోటలో 36, గుడుపల్లెలో 34.5, శాంతిపురంలో 34.5, బైరెడ్డిపల్లెలో 34.1, కుప్పంలో 33.8, రామకుప్పంలో 33.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాడ్పులు మరో రెండ్రోజులు కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-06-03T01:24:01+05:30 IST