పోలీసుశాఖలో బదిలీలు

ABN , First Publish Date - 2023-06-01T01:35:19+05:30 IST

పోలీసుశాఖలో ఐదేళ్లకుపైబడి విధులు నిర్వహిస్తున్న పోలీసులను బదిలీ చేసేందుకు బుధవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

పోలీసుశాఖలో బదిలీలు
కౌన్సెలింగ్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ రిషాంత్‌రెడ్డి

చిత్తూరు, మే 31: పోలీసుశాఖలో ఐదేళ్లకుపైబడి విధులు నిర్వహిస్తున్న పోలీసులను బదిలీ చేసేందుకు బుధవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కానిస్టేబుల్‌ నుంచి ఏఎ్‌సఐ స్థాయి అధికారి వరకు ఏఎస్పీ సుధాకర్‌ సమక్షంలో కౌన్సెలింగ్‌ జరిపారు. ఒకే స్టేషన్‌లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న 13 మంది ఏఎ్‌సఐలు, ఏడుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 20 మంది కానిస్టేబుళ్లను కౌన్సెలింగ్‌ ద్వారా బలీఈ చేశారు. ఆయా సిబ్బంది ఇచ్చిన రాతపూర్వక ఆప్షన్‌తో జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేశారు. బదిలీ అయిన వారంతా వారికి కేటాయించిన స్టేషన్లలో రిపోర్టు చేసుకుని నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి, డీపీవో క్లర్క్‌ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T01:35:49+05:30 IST