ఆరుగురు ఎస్‌ఐల బదిలీ
ABN , First Publish Date - 2023-11-01T01:48:20+05:30 IST
జిల్లాలో పనిచేస్తున్న ఆరుగురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ రిషాంత్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
చిత్తూరు, అక్టోబరు 31: జిల్లాలో పనిచేస్తున్న ఆరుగురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ రిషాంత్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూతలపట్టు ఎస్‌ఐ బి.సురే్‌షను పలమనేరుకు, పలమనేరులో పనిచేస్తున్న బి.వి.సుబ్బారెడ్డిని కుప్పానికి, కుప్పంలో పనిచేస్తున్న కె.బి.శివకుమార్‌ను రామకుప్పం పీఎ్‌సకు, బంగారుపాళ్యంలో పనిచేస్తున్న ఎం.రాంభూపాల్‌ను పూతలపుట్టు పీఎ్‌సకు, యాదమరి స్టేషన్‌లో పనిచేస్తున్న వి.సుమన్‌ను రాళ్లబూదుగూరుకు, రాళ్లబూదుగూరులో పనిచేస్తున్న డి.మునిస్వామిని చిత్తూరు వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.