రేపు, ఎల్లుండి ‘జనసేన’ సమావేశాలు
ABN , First Publish Date - 2023-09-22T00:42:28+05:30 IST
ఉమ్మడి జిల్లాలోని జనసేన నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు శని, ఆదివారాల్లో సమావేశం కానున్నారు.
నియోజకవర్గాల వారీగా నేతలతో భేటీ కానున్న నాగబాబు
వెదురుకుప్పం, సెప్టెంబరు 21: ఉమ్మడి జిల్లాలోని జనసేన నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు శని, ఆదివారాల్లో సమావేశం కానున్నారు. ఈ మేరకు నియోజకవర్గాల జనసేన ఇన్‌చార్జులకు రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాల నిమిత్తం శనివారం ఉదయం 9 గంటలకు నాగబాబు తిరుపతికి చేరుకుంటారు. మొదటగా నియోజకవర్గ స్థాయి క్రియాశీలక సభ్యులు, కార్యకర్తలతోనూ, తర్వాత ఆయా నియోజకవర్గాల నాయకులతో భేటీ అవుతారు. తొలిరోజున తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి. సత్యవేడు, గంగాధరనెల్లూరు, చంద్రగిరి.. ఆదివారం రోజున పూతలపట్టు, పలమనేరు, పుంగనూరు, కుప్పం, మదనపల్లె, తంబళ్లపల్లె, చిత్తూరు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమావేశాలు జరుగుతాయని ప్రకటనలో పేర్కొన్నారు.