పెద్దాయన వచ్చారు.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు

ABN , First Publish Date - 2023-03-26T01:10:48+05:30 IST

మామూలుగా అయితే ముఖ్యమంత్రి, గవర్నర్‌లాంటి వారు జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు ట్రాఫిక్‌ను మళ్లిస్తారు.

పెద్దాయన వచ్చారు.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు
కట్టమంచి బ్రిడ్జి వద్ద నిలిచిపోయిన వాహనదారులు

చిత్తూరు, మార్చి 25: మామూలుగా అయితే ముఖ్యమంత్రి, గవర్నర్‌లాంటి వారు జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. మిగిలిన మంత్రులు, ఇతర ప్రముఖులు వచ్చినప్పుడు ముందు, వెనుకా పైలెట్‌ వాహనాలు వెళుతుంటే కాన్వాయ్‌ వెళ్లిపోతుంది. అందుకు విరుద్ధంగా శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన ఆసరా కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి హాజరయ్యారు. మంత్రి తిరుపతి నుంచి చిత్తూరుకు వస్తూ నగరంలోని దొడ్డిపల్లె సప్తకన్నికలమ్మ అమ్మవారిని దర్శించుకుని బయలుదేరారు. దొడ్డిపల్లె నుంచి మంత్రి ఆర్టీసీ బస్టాండు మీదుగా అంబేడ్కర్‌ భవన్‌కు వెళ్లడానికి కట్టమంచి బ్రిడ్జి వద్ద పోలీసులు వాహనాలను ఆపేశారు. దాంతో కట్టమంచి నుంచి కోర్టు, హైరోడ్డంతా బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలతో పాటు అంబులెన్స్‌ వాహనాన్ని కూడా పోలీసులు ముందుకు పోనీయలేదు. మంత్రిని దొడ్డిపల్లెలో కలిసేందుకు వెళుతున్న నగర మేయర్‌ అముద వాహనాన్ని సైతం పోలీసులు అనుమతించలేదు. ఇలా సుమారు 40 నిమిషాల పాటు వాహనాలను ఆపేయడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

Updated Date - 2023-03-26T01:10:48+05:30 IST