చంద్రబాబుపై తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలి
ABN , First Publish Date - 2023-09-18T01:39:34+05:30 IST
మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ అధికారులు అక్రమంగా బనాయించిన కేసును ఉపసంహరించుకోవాలని, ప్రతిపక్ష పార్టీలపైన, ప్రజా ఉద్యమాలపైన అణచివేత చర్యలు మానాలని అఖిలపక్ష సమావేశంలో నాయకులు తీర్మానించారు.

గాంధీ విగ్రహం వద్ద శాశ్వత ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలి
అఖిలపక్ష సమావేశంలో తీర్మానం
చిత్తూరు రూరల్, సెప్టెంబరు 17: మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ అధికారులు అక్రమంగా బనాయించిన కేసును ఉపసంహరించుకోవాలని, ప్రతిపక్ష పార్టీలపైన, ప్రజా ఉద్యమాలపైన అణచివేత చర్యలు మానాలని అఖిలపక్ష సమావేశంలో నాయకులు తీర్మానించారు. చిత్తూరులో ఆదివారం అఖిలపక్ష పార్టీలతో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసహనం, వ్యతిరేకత నెలకొన్న సందర్భంగా ప్రతిపక్ష పార్టీల్నీ అణచివేసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేయంచారని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. మంగళవారం నుంచి చంద్రబాబు విడుదలయ్యే వరకు అఖిలపక్షాల ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు. చిత్తూరులో సమావేశాలు, సభలకోసం ఽగాంధీ విగ్రహం వద్ద ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, టీడీపీ నాయకులు దొరబాబు, హేమలత, కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, సీపీఎం గంగరాజు తదితరులు పాల్గొన్నారు.