ఐకాన్‌ మిస్‌ ఇండియా భావన

ABN , First Publish Date - 2023-03-28T03:14:40+05:30 IST

ముంబయిలో జరిగిన ఐకాన్‌ మిస్‌ ఇండియా పోటీల్లో చంద్రగిరి యువతి భావన విన్నర్‌గా నిలిచింది.సోమవారం రాత్రి చంద్రగిరికి చేరుకున్న భావనకు చంద్రగిరివాసులు ఘనస్వాగతం పలికారు.

ఐకాన్‌ మిస్‌ ఇండియా భావన
చంద్రగిరిలో ర్యాలీగా వెళ్ళుతున్న భావన

చంద్రగిరి, మార్చి 27 : ముంబయిలో జరిగిన ఐకాన్‌ మిస్‌ ఇండియా పోటీల్లో చంద్రగిరి యువతి భావన విన్నర్‌గా నిలిచింది.సోమవారం రాత్రి చంద్రగిరికి చేరుకున్న భావనకు చంద్రగిరివాసులు ఘనస్వాగతం పలికారు. బాణాసంచా పేలుళ్ల నడుమ ఓపెన్‌ టాప్‌ వాహనంలో ర్యాలీగా భావన ఇంటికి చేరుకున్నారు.తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఐకాన్‌ మిస్‌ ఇండియా పోటీల్లో విజయం సాధ్యమైందని భావన తెలిపారు.టీడీపీ నాయకులు పులికంటి మోహన్‌రెడ్డి, బాల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-28T03:14:40+05:30 IST