పులికాట్‌లో సందడి
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:13 AM
దేశంలోనే రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్ విదేశీ విహంగాల కిలకిలరావాలతో పులకరించిపోతోంది.
సూళ్లూరుపేట, డిసెంబరు 17: దేశంలోనే రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్ విదేశీ విహంగాల కిలకిలరావాలతో పులకరించిపోతోంది. నిన్న మొన్నటి వరకు నీరులేకుండా ఉండిన సరస్సుకు మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో పులికాట్‌కు భారీగా వరదనీరు చేరింది.దీంతో సరస్సు పక్షుల కిలకిలలతో పాటు తెరచాప పడవ అందాలు, జాలర్ల చేపలవేటతో సందడిగా కనిపిస్తోంది. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో కుదిరి నుంచి అట్టకానితిప్ప మధ్యలో సరస్సులో పక్షుల సందడి కనిపిస్తోంది. వేనాడు, కొరిడి-పేర్నాడు రోడ్డు మార్గంలో కూడా పక్షులు సరస్సులో కేరింతలు కొడుతున్నాయి. ఆదివారం కావడంతో ఈ పక్షులను చూసేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో విచ్చేశారు.పక్షులతో పాటు జాలర్ల చేపలవేట, తెరచాప పడవ అందాలను చూస్తూ పడవల్లో షికారు చేశారు.