మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లు వద్దని వీసీకి చెప్పా

ABN , First Publish Date - 2023-08-02T01:30:42+05:30 IST

‘నేను కూడా ఎస్వీయూ పూర్వ విద్యార్థినే.యూనివర్సిటీ విద్యార్థులకు అన్యాయం జరిగితే చూస్తూ ఎలా ఊరుకుంటా?వర్సిటీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఉన్న మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల నిర్మాణం చేపట్టవద్దని వీసీ రాజారెడ్డికి సూచించా. అవసరమైతే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఈ రోడ్లు వేయడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీలో లాగా యాక్సిడెంట్లు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లకు నేను కూడా వ్యతిరేకమే’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టు ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు తెలిపారు.

మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లు వద్దని వీసీకి చెప్పా
మంత్రి పెద్దిరెడ్డికి విన్నవిస్తున్న ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు

- ఏఐఎ్‌సఎఫ్‌ నేతలతో మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఆగస్టు 1: ‘నేను కూడా ఎస్వీయూ పూర్వ విద్యార్థినే.యూనివర్సిటీ విద్యార్థులకు అన్యాయం జరిగితే చూస్తూ ఎలా ఊరుకుంటా?వర్సిటీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఉన్న మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల నిర్మాణం చేపట్టవద్దని వీసీ రాజారెడ్డికి సూచించా. అవసరమైతే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఈ రోడ్లు వేయడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీలో లాగా యాక్సిడెంట్లు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లకు నేను కూడా వ్యతిరేకమే’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టు ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు తెలిపారు. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లు వేయకుండా సహకరించాలని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా కార్యదర్శి బండి చలపతి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం తిరుపతిలో మంత్రిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేసింది. యూనివర్సిటీలో మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లు వేయడం వల్ల, విద్యార్థులు, ఉద్యోగులకు జరిగే నష్టాన్ని మంత్రి పెద్దిరెడ్డికి ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు వివరించారు. దీంతో స్పందించిన మంత్రి యూనివర్సిటీలో మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లకు తాను కూడా వ్యతిరేకమేనని వ్యాఖ్యానించినట్టు బండి చలపతి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎ్‌సఎఫ్‌ ఎస్వీ యూనివర్సిటీ అధ్యక్షుడు సుందర్‌, నవీన్‌, శివ, సాయి పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T01:30:42+05:30 IST