టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్‌పై ఎర్ర స్మగ్లర్ల దాడి
ABN , First Publish Date - 2023-05-27T00:44:43+05:30 IST
ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి బరితెగించారు.కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై దాడికి తెగబడ్డారు. అంకమరావు అనే కానిస్టేబుల్‌ను చుట్టుముట్టి తీవ్రంగా కొట్టారు.

తిరుపతి అర్బన్, మే 26 : ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి బరితెగించారు.కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై దాడికి తెగబడ్డారు. అంకమరావు అనే కానిస్టేబుల్‌ను చుట్టుముట్టి తీవ్రంగా కొట్టారు.శుక్రవారం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ మురళీధర్, చెంచుబాబు ఆధ్వర్యంలో ఆర్‌ఐ సురేష్‌కుమార్ రెడ్డి, కృపానందకు చెందిన రెండు బృందాలు కూంబింగ్ చేపట్టాయి. చిప్పగుండి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లు కనిపించారు. పట్టుకునేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్ అంకమరావును చుట్టుముట్టి తీవ్రంగా కొట్టి పారిపోతుండగా వేలూరు జిల్లా అనేకట్టుకు చెందిన స్వామినాథన్ గోవిందన్ (28), షణ్ముగం పొన్ను స్వామి (52)లను పట్టుకున్నారు.ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన కానిస్టేబుల్ అంకమరావును రుయాస్పత్రికి తరలించారు. పింఛా అటవీ ప్రాంతంలోని జిల్లేళ్లమంద వద్ద మామిడితోపులో కొందరు స్మగ్లర్లు ఎర్రచందనం తరలించడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ప్రయత్నించారు. వారు తప్పించుకోగా 11 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.