పాత పెన్షన్‌ విధానాన్ని సాధించే వరకు పోరాటం

ABN , First Publish Date - 2023-09-26T01:39:40+05:30 IST

‘మాట తప్పను.. మడమ తిప్పను అని పదే పదే చెప్పారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎ్‌సను రద్దుచేస్తామని విపక్ష నేతగా హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక దగా చేశారు. మాట తప్పనంటే ఇదేనా?’ అని జగన్‌ను ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రశ్నించింది.

పాత పెన్షన్‌ విధానాన్ని సాధించే వరకు పోరాటం
కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు

చిత్తూరు, సెప్టెంబరు 25: ‘మాట తప్పను.. మడమ తిప్పను అని పదే పదే చెప్పారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎ్‌సను రద్దుచేస్తామని విపక్ష నేతగా హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక దగా చేశారు. మాట తప్పనంటే ఇదేనా?’ అని జగన్‌ను ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రశ్నించింది. ఓపీఎస్‌ పునరుద్ధరణపై ఉద్యోగులను ఎందుకు దగా చేస్తున్నారని నిలదీసింది. ఫ్యాప్టో పిలుపు మేరకు సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నాయకులు మాట్లాడుతూ.. పాత పెన్షన్‌ విధానం తప్ప తమకు మరేది ప్రత్యామ్నాయం కాదని చెబుతున్నా బలవంతంగా జీపీఎ్‌సను రుద్దడం సమంజసం కాదన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రాజస్థాన్‌, హరియాణా సహా ఆరు రాష్ట్రాల్లో సీపీఎ్‌సను రద్దు చేసి ఓపీఎస్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఏ సంఘం జీపీఎ్‌సను సమర్థించడం లేదని స్పష్టంచేశారు. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదన్నారు. ‘జగనన్నా మాట తప్పకు.. మడమ తిప్పకు’ అంటలూ నినాదాలు చేశారు. మునాఫ్‌ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఫ్యాప్టో సభ్య సంఘాల నేతలు దేవరాజులురెడ్డి, జీవీ రమణ, మునిరామన్‌, కిరణ్‌కుమార్‌, అరుణ్‌కుమార్‌, రామ్మూర్తి, రాష్ట్ర నేతలు గంటా మోహన్‌, చెంగల్రాయమందడి, రఘురామరెడ్డి, సోమశేఖర్‌ నాయుడు, మోహన్‌, మదన్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T01:39:40+05:30 IST