మంచు కప్పేస్తుంది
ABN , Publish Date - Dec 23 , 2023 | 01:56 AM
మంచు దుప్పటి కప్పేస్తోంది. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 వరకు మంచు ప్రభావం ఉంటోంది.
మంచు దుప్పటి కప్పేస్తోంది. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 వరకు మంచు ప్రభావం ఉంటోంది. పొగమంచు కారణంగా గంగాధరనెల్లూరు మండలంలో చలితీవ్రత పెరిగింది. ఉదయం కూడా వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పగలు కూడా ఎండ ఉండటంలేదు. చలితీవ్రత కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు ఆస్మాతో బాధపడుతున్న రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- గంగాధరనెల్లూరు